రజనీకాంత్ కు డబ్బు సహాయం చేసింది ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమా చేస్తూ కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉన్నారు. అయితే రజనీకాంత్ ఒకానొక సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఉంటే రైలులో ఉన్న కూలీలు తనకి సహాయం చేశారట. అయితే ఇదంతా రజనీకాంత్ సినిమాలలోకి రాకముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.

Rajinikanth: Did you know, Superstar Rajinikanth can't write Tamil?
రజనీకాంత్ మాట్లాడుతూ SSLC చదివే సమయంలో కుటుంబ సభ్యులు పరీక్ష కోసం రూ.150 రూపాయలు ఇచ్చారని అయితే ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానని తనకు ముందే తెలుసని రజనీకాంత్ తెలియజేశారు. అయితే మద్రాస్ రైలు ఎక్కానని.. కానీ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎక్కడో టికెట్ పడిపోయిందని రజనీకాంత్ తెలిపారు. టికెట్ ఇన్స్పెక్టర్ చెకింగ్ కోసం రాగ టికెట్ పోయిందని చెప్పగా ఫైన్ కట్టమని చెప్పారట. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో టిసి గట్టిగా అరవడంతో ఐదు మంది రైల్వే కూలీలు తన జరిమానా కట్టినట్లు తెలియజేశారు.

When young Rajinikanth fled to Madras with his school fees

అప్పుడు నేను టికెట్ తీసుకోలేదని అనుకుంటారేమో అని నేను టికెట్ తీసుకోవడం వాస్తవమని ఈ విషయాన్ని టిసి కు చెబుతున్న నమ్మడం లేదని రజనీకాంత్ తెలియజేశారు. అయితే చివరికి టిసి నమ్మడంతో రజనీకాంత్ తన జీవితంలో తెలియని వ్యక్తి తనను నమ్మడం ఇదే మొదటిసారి అని తెలియజేశారు. ఇక అటు తర్వాత తనను నమ్మిన వ్యక్తి బాలచందర్ అని రజనీకాంత్ తెలియజేశారు. ఆ తర్వాత ప్రజలు తనని ఎక్కువగా నమ్ముతున్నారని ప్రజలు నమ్మకాన్ని తను ఎప్పుడు ఒమ్ము కానివ్వనని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ తెలియజేసిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest