శోభన్ బాబు ఆస్తులతో ఒక రాష్ట్రాన్ని బాగుచేయ్యొచ్చని మీకు తెలుసా.?

అలనాటి సూపర్ స్టార్ హీరోలలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో శోభన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా ఈయన సినిమా వస్తుందంటే చాలు ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ ను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఆంధ్రా సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు సినిమాలు టీవీలో వస్తున్నాయంటే చాలు ఆడవారు సైతం టీవీకి అతుక్కుపోతుంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ మనమధ్య చిరంజీవులు గానే నిలిచిపోతారు. ముఖ్యంగా స్టార్ స్టేటస్ గొప్పగా ఉన్న సమయంలోనే సినిమాలలో నటించింది చాలు అనుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి చెన్నైలో స్థిరపడ్డారు.

Why Did Heroines Pressurize Star Hero? | cinejosh.com
ఇక శోభన్ బాబు గారికి కరుణ శేషు అనే ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఈయన మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇకపోతే ఈయన ఆస్తుల గురించి ఇండస్ట్రీలో ఎన్నో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శోభన్ బాబు సంపాదించిన డబ్బులను ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేసేవారట అప్పట్లో సినిమాల నుండి వచ్చిన పారితోషకాన్ని తీసుకొని భూములను కొనుగోలు చేశాడట. ఇక అలా అప్పట్లోనే కొన్ని వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారట శోభన్ బాబు.

శోభన్ బాబు భార్య గొప్పతనం తెలిస్తే రెండు చేతులు జోడించి దండం పెడతారు | The  News Qube

ప్రస్తుతం ఆ భూముల విలువ సుమారుగా రూ.70 వేల కోట్ల రూపాయల ఉంటుందని అంచనా. ఇక ఇంతటి భారీ మొత్తంలో విలువైన ఆస్తులు నాటితరం, నేటితరం హీరోలకి కూడా లేదని చెప్పాలి. ఉన్న ఆస్తులతో ఒక రాష్ట్రాన్ని బాగు చేయించొచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక సీనియర్ ఆర్టిస్టుగా కోట్ల రూపాయలను సంపాదించుకున్న శోభన్ బాబు నేడు వాళ్ళ కుటుంబాలు కూర్చొని పది తరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదించారు. ఈయనకున్న ఎస్టేట్ చూడడానికి ఉదయం వెళ్తే తిరిగి రావడానికి సాయంత్రం అవుతుందట. అంతలా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు శోభన్ బాబు.