ప్రభాస్ ఆస్తి ఎన్ని వందల కొట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటించే చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక చిత్రానికి రూ.100 కోట్ల రూపాయలు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎంత ఆస్తిని కూడబెట్టుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Prabhas heaps praise on Kantara | Kannada Movie News - Times of India
ప్రభాస్ ప్రస్తుతం కొన్ని వేల కోట్ల ఆస్తులకు వారసుడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతటి ఆస్తి ప్రభాస్ రావడానికి ముఖ్య కారణం కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఆయన స్వతహాగా కూడా ఇదంతా సంపాదించారు అన్నట్లుగా సమాచారం.

Throwback: When Prabhas posed for a perfect PIC with his late uncle  Krishnam Raju and family | PINKVILLA ప్రభాస్ తండ్రి సత్యనారాయణ రాజు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండేవారు ఈయన చెన్నై ,బెంగళూరు తోపాటు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Prabhas' unseen adorable pictures with his family, check out | Regional  Indian Cinema

ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత సత్యనారాయణ రాజుకు, ఇటు కృష్ణంరాజుకి ఏకైక వారసుడు కావడంతో ఇక ఇద్దరి ఆస్తి కూడా ప్రభాస్ కే చెందుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ తండ్రి ప్రభాస్ పెదనాన్న ఇద్దరు కూడా వివిధ ప్రాంతాలలో పలు ఫామ్ హౌస్ నిర్మించడమే కాకుండా, పలు మల్టీప్లెక్స్ థియేటర్లు తో పాటు, పలు భూములను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఏకంగా రూ.6500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇదంతా కేవలం తన తల్లిదండ్రుల నుంచి రావడం జరిగిందట.