అన్ స్టాపబుల్-2 షోకి బాలయ్య పారితోషకం ఎంతో తెలుసా..?

స్టార్ హీరో బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు టాక్ షో, మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో తో బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. దీంతో బాలకృష్ణ ఈ షో కి దాదాపుగా రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక బాలకృష్ణ సినిమాలో కూడా ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం కాబోతున్నది. ఈ షో కి ఊహించని విధంగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

Unstoppable-2: 30 వేల మందితో బాలయ్య 'అన్‌స్టాపబుల్ 2' ఈవెంట్ - NTV Telugu

ఆహ సంస్థ ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో అంచనాలకు మించి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అందుచేతనే ఈ షో కి సీజన్ -2 ని ప్రారంభించారు. ఈ షో కోసం బాలయ్య రూ.10 కోట రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్త వినిపిస్తోంది. అయితే ఆహా నిర్వాకులు మాత్రం రూ.8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సముఖంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షో కి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ షోకి గేస్టుగా హాజరు కాబోతున్నారు.

దీపావళికి అటు ఇటుగా ఎపిసోడ్ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోకు పవన్ కళ్యాణ్ ను కూడా రప్పించే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నట్లు సమాచారం . ఈ షో తో మరింత హైప్ పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆహా నిర్వాహకులు. అంతేకాకుండా వీటివల్ల ఆహా సబ్స్క్రిప్షన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆహ సక్సెస్ కావడానికి బాలయ్య కూడా తన వంతు సహాయంగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇందులో సినిమాలు వెబ్ సిరీస్ కూడా విడుదలవుతూ బాగా క్రేజ్ ను సంపాదించింది.

Share post:

Latest