డోన్‌ బలబలాలు..వైసీపీకి ప్లస్..బుగ్గనకు మైనస్..!

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం అంటే వైసీపీ కంచుకోట అని డౌట్ లేకుండా చెప్పొచ్చు..గత రెండు ఎన్నికల్లో డోన్ నుంచి వరుసగా వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. అందులోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మొన్నటివరకు డోన్‌లో బుగ్గనకు తిరుగులేదని పరిస్తితి..కానీ ఎప్పుడైతే టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి వచ్చారో..అప్పటినుంచి డోన్‌లో రాజకీయం మారింది.

ప్రస్తుతం డోన్‌లో పార్టీల బలబలాలు చూసుకుంటే…డోన్‌లో వైసీపీకి ప్లస్ ఉంది..బుగ్గనకు మాత్రం మైనస్ ఉంది. అది ఏంటి బుగ్గన వైసీపీనే కదా..అలాంటప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి అనుకోవచ్చు. ఇక్కడే అసలు కథ ఉంది. వాస్తవానికి డోన్‌లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది..బలమైన కార్యకర్తలు ఉన్నారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు ఉన్నాయి. ఓవరాల్‌గా డోన్‌లో రెండు పట్టణాలు, 45 గ్రామాలు ఉన్నాయి. పట్టణాల్లో వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉన్న..టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. అలాగే 45 గ్రామాల్లో దాదాపు 25 పైనే గ్రామాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది.

అంటే డోన్ నియోజకవర్గంలో వైసీపీ పరంగా పాజిటివ్ ఉంది..కానీ నెగిటివ్ మాత్రం బుగ్గనతోనే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే బుగ్గన ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండరు..ప్రజల్లో కలవడం, తిరగడం గాని తక్కువ. అన్నిటికంటే ఆర్ధిక మంత్రిగా ఉంటూ కూడా డోన్‌లో అభివృద్ధి పెద్దగా చేయకపోవడం. డోన్ పట్టణం వరకు అభివృద్ధి జరుగుతుంది..కానీ గ్రామాల్లో అభివృద్ధి తక్కువ. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు…ఇక్కడ పార్టీ పరంగా ప్లస్ ఉన్న..బుగ్గన పరంగా మైనస్ ఉందని.

టీడీపీ విషయానికొస్తే..సుబ్బారెడ్డి వచ్చాక డోన్‌లో పార్టీ బలం పెరిగింది..ప్రజల్లో నిత్యం ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తక్కువ కాలంలోనే బలం పుంజుకున్నారు. దాదాపు 15 గ్రామాల్లో టీడీపీకి బలం ఉంది..బేతంచెర్ల టౌన్‌లో పార్టీకి బలం ఉంది. కానీ డోన్‌ టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. కే‌ఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. అయితే ఇందులో కోట్ల వర్గాన్ని సుబ్బారెడ్డి దగ్గర చేసుకున్నారు.

కానీ కే‌ఈ వర్గాన్ని పూర్తి స్థాయిలో కలుపుకోలేకపోతున్నారు. ఇక బుగ్గనతో పోలిస్తే ఆర్ధిక బలం విషయంలో వెనుకబడి ఉన్నారు. అయితే బుగ్గనపై వ్యతిరేకత, టీడీపీలో ఉన్న వ్యతిరేక గ్రూపులని కలుపుకుని పనిచేస్తే డోన్‌లో టీడీపీ గెలుపు అవకాశాలు ఉంటాయి..లేదంటే మళ్ళీ బుగ్గన గెలవడం ఈజీ.