కూతుర్ని అల్లుడిని కలిపిన రజినీకాంత్… అసలు విషయం ఏమిటంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదట.. మళ్లీ ఇద్దరూ ఒకట‌వ‌బోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

Dhanush, wife Aishwaryaa divorce: Ending 18-year marriage, actor pens letter - IBTimes India

ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ సంవత్సరం జనవరిలో విడాకులు తీసుకుంటున్నామంటు సోషల్ మీడియా వీడియో వేదికగా వారు ప్రకటించారు. ధనుష్ ఐశ్వర్య విడిపోవడం రజినీకాంత్ కు ఇష్టం లేదట. ఈ క్రమంలోనే రజినీకాంత్ ధనుష్ తండ్రి కస్తూరి రాజా.. ధనుష్ ఐశ్వర్య ని ఒక్కటి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే వీరిద్దరిని మళ్లీ తిరిగి కలపటానికి ప్రయత్నాలు కూడా చేశారట. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిద్దరు వేరువేరుగా ఉంటూ.. 9 నెలలు ఎవరికి వారు వారికి ఇష్టం వచ్చినట్టు గడిపేశారు. అయితే ఇప్పుడు మీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది.

Dhanush and Aishwarya Rajinikanth have announced their separation. - Autobizz Blogs

వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇటీవల రజినీకాంత్ నివాసంలో ఐశ్వర్య ధనుష్ కలుసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ వీరిద్దరూ తమ విడాకుల నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. వారి మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకుని మళ్లీ కలిసి పోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావటంతో ధనుష్ రజనీకాంత్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

Share post:

Latest