అమర్నాథ్..అనకాపల్లిలో రిస్క్ పెంచుకుంటున్నారా?

రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయాయి..ఒకప్పుడు పాలసీ ప్రకారమే రాజకీయ పార్టీలు విమర్శించుకునేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోతున్నాయి. ఎంత అవుననుకున్న, కాదు అనుకున్న ఈ వ్యక్తిగత దూషణల దాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ నేతలే. అధికారంలో ఉండటంతో..తాము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, ఏం తిట్టిన ప్రతిపక్షాలు ఏం చేయలేవనే కోణంలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు.

ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే అధికారం వైసీపీ చేతుల్లో ఉండటంతో..తిట్టిన టీడీపీ నేతలని జైలుకు పంపించే కార్యక్రమాలు జరిగాయి. సరే ఏదేమైనా గాని ఈ వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయి. మళ్ళీ తిట్టే వారికి ప్రజల మద్ధతు ఉంటుందా? అంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.  కానీ ఇలాంటి బూతుల రాజకీయాన్ని ప్రజలు హర్షించరు అనే చెప్పాలి.

అలా మాట్లాడే వారికి ప్రజల్లో నెగిటివ్ పెరుగుతుందనే చెప్పాలి. అటు వైసీపీ అయిన, ఇటు టీడీపీ అయిన తిట్టే వారిని పార్టీ అభిమానులు అభిమానిస్తారేమో గాని..సామాన్య ప్రజలు హర్షించరు. అలాంటి వారిపై అభిప్రాయం మారిపోతుంది. ఇక మంత్రి అయ్యాక దూషణలు మొదలుపెట్టిన మంత్రి అమర్నాథ్‌కు కూడా రిస్క్ పెరిగేలా ఉంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే..వాటిని హుందాగా తిప్పికొట్టాలి. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల యూజ్ లేదు.

ఇక ఈయన ఏ స్థాయిలో పవన్‌ని టార్గెట్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు.  తాజాగా కూడా విశాఖలో తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో..పవన్ ఒక ఉగ్రవాది అని, సైకో అని, ఆయన అభిమానులు సైకోలు అని, మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అయితే ఆయన పార్టీ విధానం ప్రస్తుతానికి మూడు పెళ్లిళ్లు అని, ఏదైనా చేస్తే పవన్‌ని కూడా లోపలేస్తాం అని, అలాగే పవన్ విశాఖలో ఉన్నంతవరకు ఆడపిల్లలు బయటకురావద్దు అని, పొరపాటున ఎవరైనా వస్తే ఎక్కడ తాళికట్టేస్తాడోనని భయపడుతున్నాం అని సెటైర్లు వేశారు. విధానపరంగా విమర్శలు చేస్తే బాగుండేది గాని..ఇలా వ్యక్తిగతంగా మాటల దాడి చేయడం అనేది అమర్నాథ్‌కు ఇబ్బంది.

ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కూడా ఈ మాటలు హర్షించరు. ఏమైనా గాని నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిస్తే మాత్రం అనకాపల్లిలో అమర్నాథ్‌కు పెద్ద రిస్క్ అవుతుంది.