అల్లు అర్జున్ కి ఉన్న ఆ దమ్ము..మెగా హీరోలకు ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అల్లు VS మెగా ఫాన్స్ వార్ మళ్లీ మొదలైనట్టు తెలుస్తుంది . ఇప్పటికీ అల్లు మెగా ఫ్యామిలీకి పడట్లేదని ..మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ అవమానించాడు అంటూ గత కొంతకాలంగా వీళ్ళ మధ్య మనస్పర్ధలు కంటిన్యూ అవుతున్నాయి అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన అల్లు స్టూడియోస్ ఫంక్షన్ లో అల్లు మెగా ఫ్యామిలీ కలిసి మెలిసి తిరగడంతో అందరి నోరులు మూయించిన్నట్లైంది.

Chiranjeevi, Allu Arjun, Allu Sirish and Allu Arvind Visuals @ Allu Studios  Opening | Filmyfocus.com - YouTube

మళ్లీ అలాంటి వార్తలకు ఆజ్యం పోస్తూ బీహేవ్ చేసింది మెగా ఫ్యామిలీ . అల్లు అర్జున్ కి ఫిలింఫేర్ వస్తే రియాక్ట్ కాకపోవడంతో అల్లు అభిమానులు ఫైర్ అయ్యారు. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి ..మెగా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ లాగా సొంత టాలెంట్ తో పైకి వచ్చి అవార్డు కొట్టే సత్తా మీ మెగా హీరోలకి ఎక్కడ ఉంది అంటూ కొందరు మెగా హీరోలు ను టార్గెట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి చాలామంది మెగా ట్యాగ్ తో వచ్చారు. అల్లు అర్జున్ కూడా అలాగా వచ్చిన వాడే.. కానీ ఏ సినిమా విషయంలోను మెగాస్టార్ హెల్ప్ తీసుకోలేదు.. అల్లు అరవింద్ హెల్ప్ అంతకన్నా తీసుకోలేదు.

SIIMA 2022 Winners: 'Pushpa' Wins Big, Ranveer Singh Named 'Most Popular  Hindi Actor in South'

తన సొంత టాలెంట్ తో కధలను నమ్ముకుంటూ సినిమాకు తగ్గట్టు కష్టపడి ఇలాంటి స్థాయికి వచ్చాడు . అయితే మెగా ట్యాగ్ తగిలించుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొందరు మెగా హీరోలు మాత్రం ఇంకా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్లపై మండిపడ్డారు .మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి రావడం కాదు ..సొంత టాలెంట్ తో నటించే అవార్డు కొడితే ఆ హ్యాపీనెస్ ఏంటో మీకు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి అవార్డు వచ్చినందుకు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది ..అందరూ ఫాన్స్ స్టార్స్ విషెస్ చెబుతున్నారు ,,కనీసం మెగా హీరోల కంటికి ఆ మాత్రం కనిపించలేదా” అంటూ మెగా హీరోలపై ఫైర్ అవుతున్నారు అల్లు ఫాన్స్. దీంతో మరోసారి సోషల్ మీడియాలో అల్లు VS మెగా ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది.