23 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్న 57 ఏళ్ల నటుడు పృథ్విరాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా పేరు పొందాడు బబ్లూ పృధ్విరాజ్. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టారు. ఇక తెలుగులో హీరో గానే కాకుండా విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటారని చెప్పవచ్చు. అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమాలో నటించని పృథ్వీరాజ్.. అప్పుడప్పుడు బుల్లితెరపై పలు ప్రసారమైయే షో లలో గెస్ట్ గా కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఒక విషయం మాత్రం ఇప్పుడు పృథ్వీరాజ్ గురించి చాలా వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

56 Year Old Tamil Actor Married A 23 Year Old Girl ?? - Chennai Memes
అసలు విషయం ఏమిటంటే నటుడు పృథ్వీరాజ్ తన భార్యతో విభేదాలు వచ్చాయని అందుచేతనే తాను దూరంగా ఉంటూ రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు ఎక్కువగా ప్రచారంలో వినిపిస్తున్నాయి. అది కూడా 23 ఏళ్ల అమ్మాయితో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మలేషియా అమ్మాయి అన్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం సీక్రెట్ గా ఈ యువతి తోనే కలిసి ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం తమిళ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

57 வயதில் 23 வயது பெண்ணை இரண்டாம் திருமணம் செய்து கொண்ட பிரபல நடிகர்.! –  Cinebloopers | Tamil Cinema News | தமிழ் சினிமா செய்திகள்
ప్రస్తుతం పృథ్వీరాజ్ వయసు 57 సంవత్సరాలు. 1994లో బినా మహిళను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక అబ్బాయి కూడా జన్మించారు. అయితే ఈ అబ్బాయి ఆటిజం తో బాధపడుతున్నట్లు గా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు బబ్లూ పృథ్వీరాజ్. తన కుమారుడికి ఎప్పుడు 27 సంవత్సరాలు. అయితే 57 ఏళ్ల వయసులో.. 27 ఏళ్ల కుమారుడు ఉండి.. 23 ఏళ్ల యువతిని వివాహం చేసుకోబోతున్నారు అనే విషయం తెలియగానే నేటిజెన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది.