వైసీపీలో ‘బాలయ్య’ సెగలు..రిస్క్‌ వద్దు..!

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్లుగా ఉంటున్న పేరుని తీసి..జగన్ ప్రభుత్వం వైఎస్సార్ అని పేరు పెట్టింది..దీనిపై టీడీపీ శ్రేణుఒలు భగ్గుమంటున్నాయి. అటు నందమూరి ఫ్యామిలీ కూడా పేరు మార్చడాన్ని ఖండించింది..వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పేరు మార్చడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ ముద్రని చెరిపివేయలేరని కాస్త డిప్లమాటిక్‌గా మాట్లాడారు. దీనిపై టీడీపీ శ్రేణులే ఫైర్ అవుతున్నాయి.

ఇదిలా ఉంచితే తాజాగా బాలయ్య..వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి విమర్శించారు. పేరు మార్చిన వాళ్ళని ప్రజలు మార్చేస్తారని, అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారని, పీతలున్నారని,  విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలయ్య వైసీపీపై ఫైర్ అయిపోయారు.

ఇక దీనికి కౌంటరుగా వైసీపీ మంత్రులు కూడా ఫైర్ అవుతున్నారు. బాలయ్య సినిమాల్లోనే హీరో అని, బయట దద్దమ్మ అంటూ జోగి రమేష్..ఇక మంత్రి విడదల రజిని ఏమో..పేరు మార్చడం గురించి తప్ప..గతంలో టీడీపీ హయాంలో అలా జరిగింది..ఇలా జారిగింది ట్వీట్ చేసేశారు. రోజా సైతం జగనన్న రియల్ సింహం అని, ఆయన ముందు ఫ్లూట్ ఊదకూడదు అని బాలయ్యపై సెటైర్ వేశారు. అటు అంబటి రాంబాబు సైతం..బాలయ్య జోకర్ అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇలా మంత్రులు ట్వీటులతోనే బాలయ్యకు కౌంటర్లు ఇచ్చారు గాని..బయటకొచ్చి మీడియా సమావేశాలు పెట్టి..గట్టిగా కౌంటర్లు ఇవ్వలేదు. అలాగే ఎప్పుడు చంద్రబాబుని బూతులు తిట్టే నాయకులు సైతం…బాలయ్యని తిట్టే విషయంలో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంటే బాలయ్యకు కౌంటర్లు ఇచ్చే విషయంలోనే వైసీపీలో ఇబ్బంది ఉందని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు నందమూరి అభిమానులు సపోర్ట్‌గా ఉన్నారు. అలాంటప్పుడు బాలయ్యని తిడితే రిస్క్ అని కొందరు సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది.