సంజయ్ తో రణబీర్ కపూర్ మళ్లీ కలుస్తారా? 15 ఏళ్ల విభేదాలకు బ్రేక్ పడుతుందా?

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ గురించి తెలిసిందే.. నార్త్ లో స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలకు సంజయ్ కేరాఫ్ అడ్రస్.. దేవదాస్, రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ప్రస్తుతం ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాలో హీరోలుగా రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లను తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.

రణవీర్ సింగ్ తో సంజయ్ కి ఎలాంటి సమస్య లేదు. ఆయన ఓకే చెప్పేస్తాడు.. ఆయనకు రణబీర్ కపూర్ తోనే సమస్య.. ఎందుకంటే వారికి 15 ఏళ్ల నుంచి విభేదాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సంజయ్ లీలా బన్సానీ సినిమా ద్వారానే.. 2007లో వచ్చిన రణబీర్ తొలి చిత్రం ‘సావరియా’కు సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెట్ లో ఉన్నప్పుడే వీరిద్దరికి విభేదాలు వచ్చాయి. దీంతో వీళ్లిదరూ మళ్లీ కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నారు.

ఇప్పటి వరకు అలానే ఉన్నారు. అయితే ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీనే వెనక్కి తగ్గారు. రణబీర్ కపూర్ ని తన సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే రణబీర్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్ కి జోడిగా రణబీర్ భార్య అలియా భట్ ని, రణబీర్ కి జోడిగా కియారా అద్వాణీని తీసుకోవాలని భావిస్తున్నారట.. అలియా భట్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

ఈ సినిమాలో నటించాలని రణబీర్ కపూర్ కి సంజయ్ చెప్పారట.. కానీ రణబీర్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఈ విషయంలో అలియా భట్ సహాయం కూడా తీసుకున్నారట సంజయ్.. ఆమె కూడా భర్త రణబీర్ కపూర్ ని ఒప్పించే ప్రయత్నం చేసిందట. అన్ని మర్చిపోయి సినిమా చేద్దామని సూచించిందట. అయితే రణబీర్ నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది.. దీంతో రణబీర్ నిర్ణయంతోనే ఈ ప్రాజెక్ట్ ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వెంటనే పట్టాలెక్కించే ప్లాన్ ఉన్నారట సంజయ్.. లేకపోతే మరో హీరోను సంప్రదించాలని ఉందట.. అలా అయితే ఈ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అవుతుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest