ఆచార్య గతే గాడ్‌ఫాదర్ సినిమాకి పడుతుందా.. వణికిపోతున్న చిరు?

చిరంజీవిని అభిమానించే వారందరూ కూడా ఆచార్య సినిమా ఫెయిల్ కావడానికి కొరటాల శివనే కారణమని అంటారు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి చిరంజీవి కూడా ఒక కారణమే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాలు చేశారు. ఆయన చూడని హిట్ అంటూ లేదు. మరి అంతటి గొప్ప అనుభవం ఉన్న చిరంజీవి ఆచార్య సినిమా ఎలా హిట్ అవుతుందని అనుకున్నారు? ఒక్కసారైనా చెక్ చేసుకోలేదా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. చిరంజీవి తలుచుకుంటే ఎన్నో సలహాలు, సూచనలు చేసి మంచి అవుట్ పుట్ రాబట్టగలరు. కానీ ఆచార్య విషయంలో మాత్రం లైట్ తీసుకునట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాప్ తర్వాత ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమాపై ఎక్కడా కూడా పెద్దగా బజ్ అనేది క్రియేట్ కావడం లేదు.

లుసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ మూవీని చిరంజీవి చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. దీనికి కారణం ఇది ఒక రీమేక్ కావడమని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్‌ రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో వేటికీ కూడా సరైన ప్రేక్షకాదరణ లభించలేదు. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే మెగాస్టార్ అప్‌కమింగ్ మూవీపై పెద్దగా బజ్ ఏమీ లేదని సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీ అని.. దీని డిజిటల్, టీవీ రైట్స్ కోసం ఎక్కువగా మనీ పెట్టడం కూడా వేస్ట్ అని ప్రీ రిలీజ్ బిజినెస్‌మేన్ అంటున్నట్లు కూడా టాక్.

ప్రీ రిలీజ్ బిజినెస్ చూసే చిరంజీవి నీరుగారి పోయారని సమాచారం. రిలీజ్‌కు ఇంకా కేవలం నెల రోజుల సమయం కూడా లేదు. అయినా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా పేలవంగా జరగడం చిరంజీవిని బాగా డిస్టర్బ్ చేస్తోందట. గాడ్ ఫాదర్ మూవీకి కూడా ఆచార్య గతే పడుతుందేమోనని అతనిలో భయం మొదలైందట. అందుకే వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాలు మొత్తం గాడ్ ఫాదర్ గురించే మాట్లాడుకునేలా, సినిమాకి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చేలా వ్యూహం రచించేందుకు చిరు తన పీఆర్ టీమ్‌లకు సూచించినట్లు సమాచారం. అలానే స్టార్ డైరెక్టర్లు, యువ దర్శకులకు ఇంటర్వ్యూలు ఇస్తూ భారీ హైప్ సృష్టించాలని చిరు భావిస్తున్నారట. పలు టీవీ షోలతో పాటు చిన్న, పెద్ద మీడియాలన్నింటికీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా చిరు రెడీ అవుతున్నట్టు వినికిడి.

Share post:

Latest