నివేదా థామస్ ముఖంపై గాయలు.. అసలు ఆమెకు ఏమైంది?

యంగ్ అండ్ టాలెండెట్ యాక్ట్రెస్ నివేదా థామస్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమే.. ఈ తమిళ బ్యూటీ విభిన్న కథలతో అలరిస్తోంది.. సినీ ఇండస్ట్రీలో తనమైన శైలిలో దూసుకుపోతోంది.. తాజాగా ఈ బ్యూటీ ‘శాకిని డాకిని’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ మూవీ కోసం ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా షాలినీ పాత్ర కోసం నివేదా థామస్ చాలా కష్టపడింది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను నివేదా, రెజీనా క్రేజీగా నిర్వహించారు.

తాజాగా నివేదా థామస్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో నివేదా ముఖంపై గాయలు ఉన్నాయి. కుడి కనుబొమ్మపైన, ఎడమ బుగ్గ మీద, కింది పెదవి కుడి భాగంలో దెబ్బ తగిలి రక్తస్రావం అవుతోంది.. ముఖంపై గాయాలైన ఫొటోను నివేదా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోను చూసిన కుర్రాళ్లు కంగారుపడిపోతున్నారు. అసలు నివేదాకు ఏమైంది? ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు.

నివేదా షేర్ చేసిన ఫొటోను సడెన్ గా చూస్తే నిజంగానే గాాయలయ్యాయోమో అనిపిస్తోంది.. కానీ ఆ ఫొటోను నిదానంగా అబ్జర్వ్ చేస్తే.. అది మేకప్ అని అర్థమవుతుంది.. ‘శాకిని డాకిని’ సినిమాలో పోరాట సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం నివేదా అలా మేకప్ వేయించుకుంది. బ్లడ్ వర్క్ మేకప్ లో నిజంగానే గాయాలు అయినట్లుగా ఉంది. మేకింగ్ సీన్స్ లో భాగంగా తీసిన స్టిల్ అది.. ఆ ఫొటోను నివేేదా సినిమా ప్రమోషన్స్ కోసం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మొత్తం నాలుగు ఫొటోలను షేర్ చేసింది.. వాటిలో మూడు ఫైట్ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు కాగా.. నాలుగో ఫొటో మాత్రం మానిటర్ లో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది చూసుకుంటుంది.. తన ఫొటోలపై ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఫొటోలు చూసి అందమైన ముఖంపై నిజంగా గాయాలు అయ్యాయని అనుకుంటారేమో అని డిస్ల్కయిమర్ ఇచ్చింది..

Share post:

Latest