తాను నటించిన టాలీవుడ్ హీరోల పై హన్సిక ఏమందంటే..?

దేశముదురు సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.. ఈ చిత్రంలో ఈమె నటనకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు. ఇదే చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటించగా , డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో విడుదలై పేను సంచలనం సృష్టించింది. అయితే హన్సిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. డైరెక్టర్ మోహన్ రమేష్ వల్లే తనకి దేశముదురు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని హన్సిక తెలియజేసింది.

Hansika Motwani Age, Family, Husband, Movies, Biography - Breezemasti

దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో తనకు 16 సంవత్సరాల వయస్సు అని.. ఆ సమయంలోనే తన 16వ పుట్టినరోజు జరిగిందని ఆ వేడుకను తను ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేస్తోంది. బన్నీ పూరి జగన్నాథ్ తన పుట్టినరోజు వేడుకలను ఒక పబ్బులో చేయించారని తెలియజేసింది. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కలిసి వేడుపాలు తాగడం ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుగా మిగిలిందని తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా ఆ సమయంలో అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ కూడా తనకు చాలా ఫన్నీగా అనిపించిందని హన్సిక తెలియజేసింది. ఇక ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పలేక చాలా టెన్షన్ పడుతున్న సమయంలో బన్నీ తన పక్కన ఉండి చాలా నవ్వించే వారట.

Manasuley Kalisey Full Video Song |Manasuley Kalisey || Allu Arjun Chakri  Hits | Aditya Music - YouTube
ఇక బాలీవుడ్ లో తన మొదటి చిత్రం హిమేష్ తో చేశానని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన కెరియర్ పరంగా ఎంతోమంది బెస్ట్ డాన్సర్ అయినా హీరోలతో తన కెరియర్ మొదట్లోనే నటించానని తెలియజేసింది. అలా కంత్రి సినిమాలో ఎన్టీఆర్ తో నటించడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపింది.

Watch Kantri on ott streaming online

ఎన్టీఆర్ ఒక మంచి మనిషి అని అంతేకాకుండా తనలో డాన్సర్ కూడా ఉన్నారని తెలియజేసింది. హన్సికకు హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం అలాంటి హార్డ్ వర్క్ బాలీవుడ్ ,టాలీవుడ్ హీరోలలో చాలానే ఉందని తెలియజేస్తోంది.

Share post:

Latest