ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని చూసి నేర్చుకో విజయ్.. ప్రముఖ నిర్మాత..!

లైగర్ సినిమా విడుదలై మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది సినీ ప్రేక్షకులు. అయితే సినిమా హిట్టవ్వడం ప్లాప్ అవడం అనే విషయం అందరికీ కామన్ గానే జరుగుతూ ఉంటుంది.కానీ కొన్నిసార్లు.. ఆ హీరోలు మాట్లాడిన మాటల వల్ల ఇలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసాయి ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ హీరోల మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నది. కానీ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చూపించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.NTR Fans Vs Vijay Devarakonda Rowdiesఈ విషయంపై నిర్మాత చిట్టిబాబు కూడా స్పందించడం జరిగింది. విజయ్ పెళ్లిచూపులు సినిమా సమయంలో అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి.. ఆటిట్యూడ్ చూపిస్తే ఇలానే ఉంటుందని తెలియజేశారు.. నువ్వు ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండాలి.. ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి ఎదుటివారితో పబ్లిసిటీలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో.. ఒక సినిమా సక్సెస్ అయినంత మాత్రాన ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఎలా ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో ఎంత పెద్ద హీరో అయినా కూడా తన పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడుతారని పరోక్షంగా విమర్శించారు.చిరంజీవి గారు చెప్పింది నిజమే: నిర్మాత త్రిపురనేని చిట్టిబాబుఇక ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న ఏనాడు కూడా ఆటిట్యూడ్ చూపించలేదు.. లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో తెలిసి వచ్చినట్టుంది.. అందుకే ముంబై థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి క్షమాపణలు చెప్పారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకో లేదంటే కెరియర్ దెబ్బతింటుందని తెలియజేశారు. పెళ్లిచూపులు సినిమా నుండి లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించే కేవలం ఆటిట్యూడ్ కారణంగా ని కెరీర్ ని నాశనం చేసుకోవద్దని తన అభిప్రాయంగా తెలిపారు.

Share post:

Latest