కృష్ణంరాజుతో తన బంధం గుట్టు విప్పిన సీనియర్ హీరోయిన్.. షాకింగ్ న్యూస్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే రెబల్ స్టార్ గా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్‌ను దక్కించుకున్న హీరోో కృష్ణంరాజు. ఈయన ఈ మధ్యనే కొన్ని అనారోగ్య సమస్యలతో మరణించార‌న్న వార్త అందరికిి తెలిసిందే. ఈయన మరణించార‌న్న వార్త బయటికి రావటంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. కృష్ణంరాజు స్వతహాగా రాజుల కుటుంబం నుండి రావడంతో ఆయన ఇంటికి ఎవరు వెళ్లిన వారికి అతిథి మర్యాదలు చేయందే ఇంటి నుంచి పంపించేవారు కాదట. కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమకు ‘చిలకా గోరింక’ అనే సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరియర్ మొదటిలో హీరో కన్నా ఎక్కువగా విలన్ పాత్రల ద్వారానే ఆయన స్టార్‌డ‌మ్‌ తెచ్చుకున్నారు. కృష్ణంరాజు చనిపోయాక ఆయన గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. వాటిలో ఇది కూడాఒకటి.

Krishnam Raju: Rebel Star, Politician dies at 83

కృష్ణంరాజు హీరోగా చాలామంది హీరోయిన్లతో నటించాడు. ఈ సందర్భంలోనే కృష్ణంరాజు -వాణ్ణి శ్రీ జోడి అంటేనే ఆ టైంలో మామూలు క్రేజ్ ఉండేది కాదు. వాళ్ళిద్దరూ హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే కృష్ణంరాజు మరణించిన తర్వాత సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆ మాటలు ఈప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాణిశ్రీ మాట్లాడుతూ..” నాకు కృష్ణంరాజుతో మంచి అనుబంధం ఉంది. కృష్ణంరాజు నేను కెరియర్ మొదటిలో ఎక్కువ సినిమాల్లో అక్క, తమ్ముడు పాత్రలో నటించాం.. ఆ టైంలో మాపై కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా వచ్చాయి.. అవి ఏమిటంటే మీ తమ్ముడు నీకంటే చాలా పొడుగ్గా ఉన్నాడు అని అనేవారు. అప్పుడు నేను వాళ్ల‌తో నాకంటే పొడుగ్గా ఉన్న తమ్ముడు దొరకడం నా అదృష్టమని వాళ్లతో అనేదానిని. తరవాత మేమిద్దరం అక్క తమ్ముళ్ల పాత్రలు కాకుండా తర్వాత చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించాం. మొదటగా మేమిద్దరం ‘కృష్ణవేణి’ సినిమాతో హీరో హీరోయిన్లుగా నటించి అందరిని మెప్పించాం. ఆ సినిమా టైంలో నేను కృష్ణంరాజుకు హీరోయిన్గా నటించడానికి నా మనసు ఒప్పుకోలేదు కానీ నన్ను పట్టుబట్టి ఈ సినిమాకు ఒప్పించారు. నన్నెందుకు హీరోయిన్గా పెట్టారంటూ ఇంకా ఎవరైనా వెతుక్కోండి అంటూ అన్నాను. కానీ నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను హీరోయిన్గా ఒప్పించారు”.

Krishnaveni (film) - Alchetron, The Free Social Encyclopedia

తర్వాత సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ సినిమా హిట్ అవడానికి మీరే కారణం అంటూ కృష్ణంరాజు గారు నన్ను పోగ‌డ్త‌ల‌ వర్షంతో ముంచేశారు. ఆ టైమ్ నుంచి కృష్ణంరాజు గారికి నేనంటే చాలా గౌరవం ఉండేది. “నాకు ఇండస్ట్రీలో ఎలాంటి సహాయం కావాలన్నా వారు నాకు చేసి పెట్టేవారు. ఒకానొక టైం లో నన్ను ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేయాలన్న టైంలో కూడా కృష్ణంరాజు గారు నా వెనకాల ఉండి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు తీసుకువెళ్లారు అంటూ వాణిశ్రీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది”.

Share post:

Latest