హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకోండి! 

బహుశా బ్రహ్మానందం అంటే ఎవరో తెలియని తెలుగు వారు ఈ భూమ్మీద వుండరనే చెప్పుకోవాలి. ఇతను తెలుగు సినిమా హాస్య నటుడు అని ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతలాగా జనల్లోకి తన సినిమాల ద్వారా దూసుకుపోయారు. అయితే ఇపుడు అతని గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. బ్రహ్మానందం 1956 గుంటూరులోని ముప్పాళ్ళ గ్రామంలో జన్మించాడు. ఇతను పుట్టగానే తల్లికి గుర్రపు వాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిగా నిలిచాడు. అప్పటికే ఆరుగురికి జన్మనిచ్చిన తల్లి, ఇతను పుట్టిన తర్వాత చనిపోతుంది అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి.

గుంటూరు PG సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పట్టా తీసుకొని 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి సినీ రంగంలోకి అడుగు పెట్టారు. 1985లో వేజల్ల సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న తాతావతారం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం జరిగింది. ఫిబ్రవరి 1 అతని పుట్టినరోజు. అదే రోజున సినిమాలలో తొలి షాట్ లో నటించడం ఆయన అదృష్టంగా భావిస్తాడు.

అతని నేపధ్య విషయానికొస్తే… బ్రహ్మానందం, లక్ష్మి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు వీరికి గౌతం, సిద్ధార్థ అనే ఇద్దరు కుమారులు సంతానం. ఒకరు MBA చేస్తే మరొకరు బీటెక్ చేశారు. గౌతమ్ కథానాయకుడిగా ‘పల్లకిలో పెళ్లికూతురు’ అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియటంతో ఈయనకు కూడా ఆ అలవాటు వచ్చింది ఖాళీ సమయాలలో బొమ్మలు గీయడం, పుస్తకాలు చదివే అలవాటు తన తండ్రి నుండి వచ్చింది.

బ్రహ్మానందం అవార్డులు రివార్డులు:

ఆహనా పెళ్ళంట ఈ చిత్రానికి గాను 1987లో ఉత్తమ నంది పురస్కారం అందుకున్నాడు.

దాదాపు 1250 చిత్రాలలో నటించి 2010లో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు.

2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును సత్కరించింది.

ఉత్తమ హాస్యనటుడుగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిలింఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా అవార్డులు అందుకున్నారు.

2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేటు ఆయనకు ప్రధానం చేసింది.

Share post:

Latest