ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?

ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం రాజీపడటం లేదు. బాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఆ మధ్య ఈ సినిమాలో ఉపయోగించేందుకు ఆనంద్ మహీంద్రాను తమ కార్లకు సంబంధించి ఇంజనీర్ల సహాయం కావాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆయనను సంప్రదించిన విషయం విదితమే. డైరెక్టర్ రిక్వెస్ట్ కి ఆనంద్ మహీంద్రా కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. మీకు అవసరమైన సాంకేతికతను మేము అందిస్తామని మాట కూడా ఇచ్చాడు. దాంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో బాగా హైప్ వచ్చింది. ప్రాజెక్టు కే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమని చాలామంది అంటున్నారు. అయితే అనుకోకుండా ప్రాజెక్ట్ కె సినిమా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

విషయం ఏమంటే, ఈ మధ్యనే రిలీజ్ అయిన ‘ఒకే ఒక జీవితం’ స్టోరీ లైన్ ప్రాజెక్ట్ K సినిమాకి దగ్గరగా ఉంటుందట. ఇక ఒకే ఒక జీవితం సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా అని తెలిసినదే. అమ్మ కోసం హీరో టైం మిషన్ లో కాలాన్ని వెనక్కి తీసుకు వెళ్తాడు. సైన్స్ ఫిక్షన్ స్టోరీకి అమ్మ సెంటిమెంట్ ను జోడించి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ప్రాజెక్టు K స్టోరీ లైన్ కూడా దగ్గరగా ఉండటం చేత సదరు నిర్మాతలు ఇపుడు తలలు పెట్టుకున్నారట. ఒకవేళ ఈ రెండు సినిమా స్టోరీ లు సిమిలర్ అయితే ప్రాజెక్ట్ K సినిమా నష్టపోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.

Share post:

Latest