ఆసక్తికరంగా ఉన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్..!!

సుధీర్ బాబు ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాని డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్స్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులను కూడా వేగవంతం చేశారు చిత్ర బృందం. తాజాగా ఈ రోజున మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.Sudheer Babu And Krithi Shetty Starrer Aa Ammayi Gurinchi Meeku Cheppali  First Look | Aa Ammayi Gurinchi...: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్  బాబుమొదట హీరోయిన్ కృతి శెట్టి నేను యాక్ట్ చేస్తా అంటూ చెప్పడంతో హీరో ఆనందంలో మునిగిపోతూ ఉండే సన్నివేశంతో మొదట ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య.. జరిగిన కొన్ని సన్నివేశాలు హీరోయిన్ తల్లికి సినిమా రంగం నచ్చకపోవడం అలా వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇందులో కృతి శెట్టి డాక్టర్ గా కనిపించనుంది. ఇక సుధీర్ బాబు మాత్రం ఫిలిం మేకర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలోని ట్రైలర్స్ అత్యంత ఆసక్తికరంగా కనిపించే విధంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తూ ఉన్నారు.

ఇక ఈ చిత్రంలోని వెన్నెల కిషోర్ ,రాహుల్ రామకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మరీ చిత్రంతోనైనా సుధీర్ బాబు, కృతి శెట్టి కెరియర్ మారుతుందేమో చూడాలి. ఇక కృతి శెట్టి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటుంది అని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు.

Share post:

Latest