టాలీవుడ్, కోలీవుడ్ ఫాన్స్ వార్… సిగ్గుపడే విధంగా ఆన్లైన్ యుద్ధం! 

సినిమా అనేది ఓ బిజినెస్. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు. హీరోలు హీరోలు బాగానే వుంటారు. ఇక్కడ నిలకడ లేనిది వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే. అనవసర అభిమానమదంతో మాహీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అని పరస్పరం వాదించుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఇదే రకమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి అందరకీ గుర్తుండే ఉంటుంది.

అది మరిచిపోకముందే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ పీక్స్ కి చేరింది. దీనికి కారణం తెలుగు సోషల్ మీడియా మీమ్ పేజెస్ అని చెప్పక తప్పదు. అవును, #MBfansUnderVIJAYfansFoot, #NationalTrollMaterialVijay అనే హ్యాష్ ట్యాగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ టీం ఏ మ్యాచ్ ఆడినా సరే ఓడిపోయే పరిస్థితులలో ఉంటే విజయ్ ఫోటోలతో ఉన్న మీమ్స్ వేస్తూ తెలుగు సోషల్ మీడియా అడ్మిన్స్ ఒక రకంగా విజయ్ అభిమానులకు కోపం తెప్పించారు.

ఈ క్రమంలో తెలుగు సోషల్ మీడియా మీమ్ పేజీ అడ్మిన్స్ చేసిన పనికి తెలుగు వాళ్ళందరూ మా విజయ్ నీ ట్రోల్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మహేష్ బాబును విజయ్ అభిమానులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గతంలో మహేష్ బాబు చేసిన ఒక్కడు లాంటి సినిమాలని విజయ్ తమిళంలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఒరిజినల్ కంటే రీమేక్ బాగుందని విజయ్ అభిమానులు ట్రోల్ చేస్తుంటే, మహేష్ అభిమానులు రంగంలోకి దిగి విజయ్ ను దారుణంగా రాయలేని విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియకుండా ఇద్దరు హీరోల అభిమానులు ఒకరకంగా దారుణమైన విధంగా ఇలా ట్రోల్ చేసుకోవడం నేడు చర్చనీయాంశంగా మారింది.

Share post:

Latest