Unstoppabul: నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..!!

ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన అహ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవ్వడమే కాకుండా పలు షో లతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ టాక్ షో నెంబర్ వన్ షో గా నిలిచిందని చెప్పవచ్చు.. తనదైన స్టైల్ లో అన్ స్టాపబుల్ సీజన్ -1 ను చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నది. చివరిగా ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది.

Watch Unstoppable Web Series Online in HD Quality - Aha

ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఈ షూటింగ్ అయిపోయిన వెంటనే అన్ స్టాప్ అబుల్ సీజన్ -2 ని మొదలు పెట్టనున్నారు. అయితే తాజాగా ఈ టాక్ షో కి సంబంధించి ఒక రాక్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె -2 టైటిల్ సాంగ్ ను ఈరోజు రిలీవ్ చేయడం జరిగింది ఆహా సంస్థ.

అయితే ఈ పాట గురించి బాలకృష్ణ మాట్లాడుతూ రోల్ రైడర్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సమకూర్చిన ఈ పాట తనకు ఎంతో బాగా నచ్చిందని తెలియజేశారు. ఆహా అభిమానులు ఈ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నారని బాలకృష్ణ తెలియజేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది. అయితే ఈ సీజన్ మొదట గెస్ట్ చిరంజీవి వస్తారని వినిపిస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

Share post:

Latest