ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..

ప్రతి శుక్రవారం థియేటర్ లో బొమ్మ పడాల్సిందే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం ఓ ప్రత్యేక అనుభూతి.. అయితే కొన్నిసార్లు థియేటర్ వెళ్లి సినిమా చూడటం మిస్ అవుతుంది.. అర్రే ఆ సినిమా మనం చూడలేదు.. అనే బాధ పడే ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. హిట్లు, ఫ్లాప్ లు, బ్లాక్ బస్టర్లు.. ఇలా ఏ సినిమా అయినా.. నెల, రెండు నెలల్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. థియేటర్ లో మిస్ అయిన సినిమాలను హాయిగా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక గతవారం ఏకంగా డజన్ సినిమాల, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. ఇప్పుడ శుక్రవారం రాబోతోంది.. ఈ వారం ఏ సినిమాలు వస్తున్నాయి.. ఏ వెబ్ సిరీస్ వస్తుంది అనే విషయాలను ప్రేక్షకులు సోషల్ మీడియాలో శోధిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ప్రకటనల మేరకు ఈ వారం 8 సినిమాలు ఓటీటీలో రాబోతున్నాయి.. మరి ఈ వారం అందుబాటులోకి వస్తున్న సినిమాలు ఏంటో చూద్దాం..

ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు:

*సూపర్ స్టార్ విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఈ వారం ఓటీటీలో వచ్చింది.. ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్ లో అయితే డిజాస్టర్ అయ్యింది. ఓటీటీలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.. సెప్టెంబర్ 28 నుంచి సోనీ లీవ్ లో తెలుగు మరియు తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
*ఓటీటీలో వస్తున్న మరో హిట్ మూవీ 777 చార్లీ.. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రితో కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
*ఇక ఈవారం ‘బ్లాండ్’ అనే ఇంగ్లీష్ మూవీ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 28 నుంచి స్టీమింగ్ అవుతోంది.
*నెట్ ఫ్లిక్స్ లోనే రాబోతున్న మరో ఇంగ్లీష్ మూవీ ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’. ఈ సినిమా సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
*ఇక సెప్టెంబర్ 29న ‘బుల్లెట్ ట్రైన్’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
*సెప్టెంబర్ 30న ‘కెప్టెన్’ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
*డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 30 నుంచి ‘కర్మ యుద్ధ్’ మరియు ‘హాకస్ ఫోకస్ 2’ అనే హిందీ సినిమాలు రాబోతున్నాయి.

Share post:

Latest