రాజమౌళి లో జనాలకి నచ్చని ఏకైక క్వాలిటీ ఇదే..హీరోలకు కూడా..!?

రాజమౌళి ..రాజమౌళి ..రాజమౌళి..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..చెప్పండి. సక్సెస్ నే తన ఇంటిపేరుగా మార్చుకున్న దర్శక ధీరుడు ఈయన. శిల్పంలా తన తండ్రి రాసుకున్న కథను.. జనాలకు అర్ధం అయ్యే విధంగా..వాళ్ల నాడి పట్టి సినిమా తీసే ఏకైక టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్. ఇప్పటివరకు రాజమౌళి ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. ఇకపై పడబోదు కూడా ..అంతటి పక్కా ప్లానింగ్ తో రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తాడు.

తన తండ్రి రాసిన కథకు తన డైరెక్షన్ తో జీవం పోసి జనాలను మెప్పిస్తున్నాడు ఈ దర్శక ధీరుడు. మగధీర ,బాహుబలి ,బాహుబలి 2 ఆర్ ఆర్ ఆర్, ఈ సినిమాలను చూస్తే రాజమౌళి స్టామినా ఏంటో మనకు అర్థమయిపోవాల్సిందే. బాలీవుడ్ లో కూడా రాజమౌళికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . బాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా రాజమౌళితో ఎప్పుడెప్పుడు సినిమా తీద్దామా..ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.

అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాజమౌళిలో జనాలు అందరికీ నచ్చని ఏకైక క్వాలిటీ ఒకటి ఉంది. ఆయన నాస్తికుడుగా ఉండడం రాజమౌళి అభిమానులకు ఇష్టం లేదు. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి గురించిన ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది. అయితే రాజమౌళి ఇలా నాస్తికుడుగా ఉండడం స్టార్ హీరోలకు కూడా నచ్చట్లేదట . ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు హీరోలు కూడా ఈ విషయం చెప్పారట. నువ్వు నాస్తికుడిగా కాకుండా ఉంటే బాగుంటుంది రాజమౌళి అంటూ ..కానీ రాజమౌళి మొండి వాడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే టైప్ ..మరి ఈయన ఇలాంటి విషయాల్లో ఎలా మారుతాడు.. మనం ఏం చెప్పగలం అంతా దైవ నిర్ణయం..!!

Share post:

Latest