NTR ను కొంతకాలం పాటూ ఇంటికే పరిమితం చేసిన చిత్రం ఇదే..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది ప్రేక్షక, జనాదరణ పొందిన ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ని సామాజిక, పౌరాణిక , చారిత్రక, జానపద వంటి ఎన్నో జానరులలో సినిమాలు తెరకెక్కించిన ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రాజకీయంగా కూడా మరింతగా ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పవచ్చు. ఇక దాదాపుగా ఎన్టీఆర్ ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని మనకు తెలిసిందే.. కానీ ఒక సినిమా మాత్రం ఆయనను 3 నెలల పాటు ఇంటికే పరిమితం చేసింది.

ఎన్టీఆర్ ని మూడు నెలలు ఇంటికే పరిమితం చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా

ఇక ఆ సినిమా ఏది అంటే తోడుదొంగలు. ఇందులో తోడుదొంగలుగా అన్నగారితోపాటు గుమ్మడి కూడా నటించారు. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా .. కొత్తగా వచ్చిన నిర్మాత కావడంతో వెనుక ముందు ఆలోచించకుండానే కాస్త ఎక్కువ ఖర్చు చేశారు. ఇక రామారావు నటించిన సినిమా అంటే హిట్టే అవుతుందని అందరూ అనుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో కూడా వెనకాడ లేదు . ఇక ఉన్నది మొత్తం సినిమా పైన పెట్టేశారు . ఇక అప్పటికే ఎన్టీఆర్ నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక తోడుదొంగలు సినిమాకి కూడా బాగానే బిజినెస్ జరుగుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేసింది ఈ సినిమా.

N. T. Rama Rao Wiki, Age, Death, Wife, Family, Biography & More - WikiBio

ముఖ్యంగా అనుకున్నంతగా ఈ సినిమా ఆడలేదు. ఇక ఎన్టీఆర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కానీ నిర్మాత మాత్రం ఎంతో ఘటికుడట.. ఎన్టీఆర్ కావాలని ఈ సినిమాలో సరిగ్గా నటించలేదు. అందుకే ఈ సినిమా ఆడలేదు అని ప్రచారం చేయడం మొదలు పెట్టాడట.. కొంతమంది నిజంగా నిజమేనని నమ్మడానికి ఈ సినిమా చూశారు. చివరికి ఈ ఎఫెక్ట్ కారణంగా ఎన్టీఆర్ మూడు నెలల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఆయనకు సినిమా ఆఫర్లు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ సినిమా అవకాశం అంది పుచ్చుకొని.. ఆ తర్వాత వెనుతిరగకుండా దూసుకుపోయారు. అయితే ఈ విషయాన్ని గుమ్మడి “తీపి జ్ఞాపకాలు చేదు గుర్తులు” అనే పుస్తకంలో రాశారు.