హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎవరికి తెలియని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగించింది హీరోయిన్ సిమ్రాన్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఇమే కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , తమిళ్ వంటి భాషలలో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది సిమ్రాన్. అయితే సిమ్రాన్ గురించి తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Actress Simran Hot Images | Simran Photo Gallery

1979 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది సిమ్రాన్. ఈమెది కూడా పంజాబీ కుటుంబం. ఈమెకి మోనాల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. సుమిత్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నారు. 2002లో సిమ్రాన్ తన పెద్ద చెల్లి మోనాల్ ను కోల్పోవడం జరిగింది. ముంబైలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగం వైపు అడుగు వేసింది సిమ్రాన్ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు అయిన దీపక్ బగ్గాను వివాహం చేసుకున్నది.. వీరికి ఆది,ఆదిత్య అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. సిమ్రాన్ అప్పట్లో దూరదర్శన్లు బాగా పాపులర్ అయినటువంటి ముకాబుల అనే కార్యక్రమంలో పాల్గొన్నది.

Actress simran adorable photos with husband and children | actress simran  family photos - YouTube
అటు తరువాత సనం హర్ జామ్ అని ఒక హిందీ చిత్రంతో సిమ్రాన్ మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత తేరే మేరే సప్నే అనే చిత్రం ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక అలా బాలీవుడ్ లో మొదట అడుగుపెట్టి తెలుగులోకి మాత్రం అబ్బాయిగారి పెళ్ళి అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఇంద్ర ప్రస్థానం అనే చిత్రంతో మలయాళం లో కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి సినిమాలలో బాగానే నటించింది సిమ్రాన్. ఇక వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. కానీ ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఫుల్ సినిమాల్లో కీలకమైన పాత్రలో నటిస్తోంది.

Share post:

Latest