వావ్: ఆ విషయంలో ఈ జంటను ఢీ కొట్టే భార్యభర్తలే లేరు..కేకోకేక..!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిరువురు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి జంట సెలబ్రిటీ జంటల్లోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి ఇరువురికి ఒక పాప కూడా జన్మించింది. అనుష్క శర్మ పాప పుట్టిన తర్వాత సినిమాలను న‌టించ‌టం పూర్తిగా మానేసింది.

సమయం మొత్తం తన బిడ్డకి కేటాయిస్తుంది. తాజాగా ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంట తమ కూతురు పేరు మీద ముంబైలో బాగా ఖరీదైన ప్రాంతంగా పేరు పొందిన ఆలీ బాగ్ లో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేశార‌ట‌. ఫామోస్ కొనుగోలు చేయడానికి ఈ జంట భారీగానే ఖర్చు చేసినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.

ఆలీ బాగ్ కు దగ్గరలో 8 ఎకరాల స్థలంలో వీరు కొన్న ఫామ్‌హౌస్ ఉందట. బాలీవుడ్ మీడియా ప్రకారం విరాట్ – అనుష్క కొన్న ఫామ్ హౌస్ ధర అక్షరాల రు. 25 కోట్లు అంటున్నారు. దీంతో విరాట్ సోదరుడు దీనికి రిజిస్ట్రేషన్ ట్యాక్స్‌గా రు. 1.15 కోట్లు గవర్నమెంట్‌కు కట్టినట్టు సమాచారం వచ్చింది. దీంతో ఒక్క ఫామ్ హౌస్ కోసం ఈ రేంజ్లో ఖ‌ర్చు పెట్టిన విరాట్ – అనుష్క‌ను మించిన జంటే లేద‌ని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Share post:

Latest