అక్కడ నటుడు కృష్ణంరాజు విగ్రహ ప్రతిష్ట..!!

ఫిలింనగర్ సొసైటీలో అతి త్వరలోనే దివంగత సినీ నటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కృత్రిమ సేవాసమితి ఆధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వారు కృష్ణంరాజు.. నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు ఎక్కువగా చూశాను. ఇక మర్యాదకు మారుపేరు రాజు.. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు అంటూ మంత్రి తలసాని కృష్ణంరాజు గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

Union Minister Kishan Reddy Comments On Krishnam Raju In Condolence Meet -  Sakshi

ఇక అంతే కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సంస్మరణ సభకు హాజరై కృష్ణంరాజు గురించి ఆయనతో ఉన్న అనుభవాల గురించి వెల్లడించారు. ఇక కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం . కృష్ణంరాజు చనిపోగానే రాజ్ నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నెంబర్ అడిగారు. ప్రభాస్ తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని వాళ్ళ కుటుంబాన్ని కలుద్దామని రాజ్ నాథ్ అన్నారు. ఇక కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలి అని తెలిపారు. ఇక అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు భీమవరం వస్తానని చెప్పినా ఆయన ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేమే అన్ని ఏర్పాట్లు చేశాము. కానీ కరోనా వల్ల వెళ్లలేక పోయారు. ఎలాంటి కల్మషం లేని.. మంచి మనసున్న వ్యక్తి కృష్ణంరాజు అంటూ ఆయన కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారు.

విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నామని ప్రకటించడంతో అటు సినీ ప్రముఖులు , ఇటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు మాస్ ఆడియన్స్ ని కూడా బాగా అలరించారు. ఇకపోతే ఈయన మరణం ఇండస్ట్రీకి లోటుగానే మిగిలిపోయింది.

Share post:

Latest