అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్ గా మారబోతున్న హీరో సోదరుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా ఇ. వి.వి సత్యనారాయణ ఎంత పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఈయనకు ఇద్దరు కుమారులు అందులో ఒకరు ఆర్యన్ రాజేష్, మరోకరు అల్లరి నరేష్.. ఆర్యన్ రాజేష్ మొదట సొంతం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఆర్యన్ రాజేష్ కేవలం కొద్ది సినిమాలలోనే మాత్రమే నటించి మెప్పించారు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు హీరోగా సక్సెస్ కాలేకపోతున్న సమయంలో కొన్ని సంవత్సరాల పాటు సినిమాకి దూరమయ్యారు.

Two Brothers Divided Between Mahesh Babu & Ram Charan
ఇక గతంలో బోయపాటి శ్రీను, రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించారు ఆర్యన్ రాజేష్. దీంతో ఈయన అభిమానుల సైతం ఆర్యన్ రాజేష్ కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతున్నారని అందరూ భావించారు. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు పలు సినిమాలలో విలన్లుగా నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో ఈ హీరో కూడా నటించేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా యువ హీరో సినిమాలో ఆర్యన్ రాజేష్ విలన్ పాత్రలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Allari Naresh Height, Age, Wife, Family, Children, Caste, Biography & More  - BigstarBio
అయితే ఆర్యన్ రాజేష్ విలన్ గా నటించి మెప్పిస్తాడనే నమ్మకాన్ని చిత్ర బృందం కూడా చాలా నమ్మకంతో ఉండడంతో ఈ స్టార్ డైరెక్టర్ కుమారుడును ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోగా సక్సెస్ కాలేకపోయినా ఆర్యన్ రాజేష్ మరి విలన్ గా సక్సెస్ అవుతారేమో చూడాలి. మరొకవైపు ఈయన సోదరుడు అల్లరి నరేష్ కూడా సినిమాల సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.చివరిగా నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు అల్లరి నరేష్. ఇక అదే తరహాలోని కథలను ప్రస్తుతం చేస్తూ బిజీ హీరోగా ఉన్నారు.

Share post:

Latest