రంగ రంగా వైభవంగా ‘ టాక్ వ‌చ్చేసింది… సినిమాకు ఈ టాక్ ఏంట్రా బాబు..!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ తేజ్ తన మొదటి చిత్రం ఉప్పెనతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన కొండ పొలం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా వైష్ణవ తేజ్, కేతికా శర్మ కలిసిన చిత్రం.. రంగ రంగా వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజున రావడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.Ranga Ranga Vaibhavanga Movie OTT Release Date, OTT Platform, Time and moreఈ సినిమా విషయానికి వస్తే రిషి, రాధా అనే చిన్నప్పటి స్నేహితులు.. వీరిద్దరూ స్నేహంతో ప్రేమతో కలిసి మెలిసి ఉండే వీళ్ళ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకోవడం వల్ల వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారుతారు. అలా ఒకరితో ఒకరు మాట్లాడకూడదని డిసైడ్ అవుతారు ఇలా వీరిద్దరూ కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండడంతో వీరిద్దరికి వివాహం చేయాలనుకుంటారు అయితే చివరికి వీరిద్దరూ ద్వేషాన్ని వదిలిపెట్టి తమ కుటుంబాల కోసం ఎలా కలుసుకుంటారో అనే కథ అంశమే ఇది. అయితే ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి తెలుగులో. ఇక ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తర్వాత సిను ఎలా ఉండబోతోంది అని ఈజీగా చెప్పేలా ఉన్నట్లుగా తెలుస్తోంది.Ranga Ranga Vaibhavanga Telugu Movie (2022): Cast | Trailer | Songs | OTT |  Release Date - News Bugzఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గా ఉన్నది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కథ పరంగా ఈ సినిమా కొత్తగా ఏమీ అనిపించలేదు ప్రేక్షకులకు. ఇక దేవిశ్రీప్రసాద్ పాటలు కూడా గుర్తుంచుకునేలా ఏమీ లేవు. ఇక డైరెక్టర్ గిరీష్ అయ్యా కూడా తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచారని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ సినిమా అని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ వరకు బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Share post:

Latest