డైరెక్టర్ తో మనస్పర్ధల కారణంగా రజినీతో సినిమా వదులుకున్న హీరోయిన్..!!

డాక్టర్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక ఈ చిత్రంతో అటు డైరెక్టర్ నెల్సన్, హీరో శివ కార్తికేయన్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కథానాయక ఎదుగుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు , మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా డాక్టర్ చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఆ తర్వాత మళ్లీ శివ కార్తికేయన్ తో మరొకసారి డాన్ చిత్రంతో మంచి విజయాన్ని. ఇక కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Thalaivar 169: Priyanka Mohan in Rajinikanth's next? Tamil Movie, Music  Reviews and News

కానీ సూర్య సరసన నటించిన ఒక చిత్రం మాత్రం ఇమెను నిరాశపరిచింది. అయినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా రజనీకాంత్ తో కలిసి జైలర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా సమాచారం. చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వం వర్ధిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో రజనీకాంత్ రెండు విభిన్నమైన పాత్రలలో చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ వైదొలిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణాలు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి.

Rajinikanth's Thalaivar 169: Director Nelson Dilipkumar Is NOT Getting  Replaced - Filmibeat
డాక్టర్ సినిమా సమయంలోనే డైరెక్టర్ నెల్సన్ తో ఈమెకు మనస్పర్ధలు వచ్చాయని అందుచేతనే రజినీకాంత్ సినిమాని వదులుకుంటోందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి.అయితే ఈ విషయంపై ఇంకా ఏ విధంగా అధికారికి ప్రకటన రాలేదు ఇకపోతే ప్రియాంక మోహన్ వదులుకున్న పాత్రని హీరోయిన్ తమన్నా నటించడానికి ఓకే చెప్పినట్లుగా సమాచారం.. ఈ విషయంపై హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Share post:

Latest