శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేసి రష్మిక మనసు దోచుకున్న చిన్నారి.. వీడియో వైరల్..!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదలయి దాదాపు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా రష్మిక మందన్న వేసిన పాటకు స్టెప్పులేస్తూ ఆమెనే తలపిస్తున్నారు. ఇక స్వామీ..నా స్వామి అంటూ వయ్యారంగా చేతులు ఊపుతూ.. నడుము తిప్పుతూ.. పిల్లలు కూడా ఈ పాటను ఇమినేట్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉండడం చూపర్లను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ క్రమంలోనే ఈ పాటకు ఒక చిన్నారి చాలా అద్భుతంగా డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది . ఎంతలా ఆకట్టుకుంది అంటే ఏకంగా రష్మికానే ఆ పాపని చూడాలని ఆ పాప అడ్రస్ కావాలని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసినట్లు సమాచారం.

Rashmika Mandanna reacts to 'cute' school girl dancing to Saami Saami. Watch - Hindustan Times

ఇకపోతే ఈ ఫోక్ సాంగ్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోస్ట్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు.. మౌనిక యాదవ్ ఈ పాటను పాడింది.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమాలోని ఈ పాటకు తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోని హిందీ వెర్షన్ కు చెందిన ఈ పాటను స్కూల్ డ్రెస్ లో ఒక పాప వేసిన డాన్స్ మూవ్మెంట్స్ మరియు హావభావాలు అందరిని కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవ్వడమే కాదు హీరోయిన్ రష్మిక వరకు వెళ్ళింది.. ఇక చిన్నారి సిగ్నేచర్ స్టెప్పులు రష్మికకు తెగ నచ్చేసాయి. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఆమెను కలవాలనుకుంటున్నాను.. ఎలా కలవాలో చెప్పాలంటూ.. కూడా ట్వీట్ చేయడం గమనార్హం.

” మేడ్ మై డే.. నేను ఈ క్యూటీ నీ మీట్ అవ్వాలని అనుకుంటున్నాను .. ఎలా ? అని రష్మిక పేర్కొంది. ఇక దీనికి తమిళ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య కూడా స్పందించారు..” లవ్ యూ బేబీ .. క్యూట్ క్యూట్ ” అంటూ అల్లు అర్జున్ – రష్మిక ను కూడా ట్యాగ్ చేశాడు.ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share post:

Latest