పెళ్లి చూపుల్లో అమ్మాయిని అలాంటి ప్రశ్న అడిగిన అబ్బాయి..తట్టుకోలేకపోయిన ఆమె.. చేతి నిండా గాజులు వేసుకొని .. !!

ఆత్మహత్య ఈ మధ్యకాలంలో ఈ పదం చాలా పాపులర్ అయింది. ఇంతకుముందు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ..అయితే మనిషి క్షణిక ఆవేశానికి లోనై బంగారు లాంటి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా స్పాట్ డెసిషన్ తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ లిస్టులో మరీ ముఖ్యంగా యువత ఎక్కువ శాతం ఉంది. మనం గమనించిన్న్ట్లయితే దాదాపు గత పది సంవత్సరాలు నుండి యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఆత్మహత్య ..ప్రేమించిన అబ్బాయి ఒప్పుకోకపోయినా ఆత్మహత్య.. ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య.. చివరికి ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ రిప్లై ఇవ్వకపోయినా ఆత్మహత్య.. ప్రతి చెత్త పనికి ..అవసరంలేని అనవసర పనికి ఆత్మహత్య చేసుకుంటూ బంగారు లాంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు కొందరు యువతి, యువకులు.


అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేసిన పనికి తిట్టాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు జనాలు. బ్రతకాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.. శారీరకంగా బలంగా కూడా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మన ప్రాణాలను మనం తీసుకోకూడదు.. అలా క్షణిక ఆవేశానికి లోనై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులో జరిగింది. గీతా వీధికి చెందిన రోజా ..ఆమె వయసు 25 . ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్పడింది. దీంతో తండ్రి ప్రతాప్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న పాయింట్ కి వస్తే.. తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ షాకింగ్ అనిపించింది.


ఈ మధ్యనే రోజాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ మంచి సంబంధాన్ని తీసుకొచ్చాడు తండ్రి . దీంతో పెళ్లి చూపులకి ముస్తాబైన రోజా పెళ్లి చూపులకు వచ్చిన వరుడు మాటలు విని బాధపడింది. చూడడానికి కొంచెం నల్లగా, పొట్టిగా ఉన్న కారణంగా చాలామంది రోజాను రిజెక్ట్ చేస్తూ వచ్చారట.

దీంతో ఇదే క్రమంలో వచ్చిన అబ్బాయి కూడా ఆమె రంగు గురించి రూపు గురించి ఆమె హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడంతో ఆ మాటలు భరించలేని రోజా చేతినిండా గాజులు ధరించి ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె మృతికి సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు రవి ప్రకాష్ ,ఉపేంద్ర సంతాపం తెలిపారు .అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఆమె చేతినిండా గాజులు వేసుకొని ఎందుకు మరణించింది అనేది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది . ఏది ఏమైనా ఆడపిల్ల జీవితం ఇలా సగంలోనే అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధాకరం.

Share post:

Latest