చిరంజీవిని ఎన్టీఆర్ తో పోల్చిన నటుడు.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందాడు సమ్మెట గాంధీ. అయితే ఇటీవల ఆయన తననట ప్రస్థానంలో కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాలో తనకు ఒక మంచి పాత్ర ఇచ్చారని అయితే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి అంత చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. చిరంజీవి కూడా ఒకసారి చూద్దామని చెప్పమని చెప్పగా ఆ డైలాగ్ చెప్పగానే బాగుందని చిరంజీవి మెచ్చుకున్నారని తెలిపారు.

మీతో కలిసి గ్యాంగ్ లీడర్ లో నటించాను

అలా చిరంజీవి ఆ డైలాగ్ బాగుందని మైక్ లో మెచ్చుకోవడం తనకి ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతిని తెలిపారు సమ్మెట గాంధీ. ఇక ఆ సమయంలోనే సమ్మెట గాంధీ మాట్లాడితే మీతో కలిసి నేను గతంలో ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కూడా నటించానని చెప్పారట. ఇక గతంలో కూడా 1991లో గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నటించానని చెప్పారట చిరంజీవి ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఏ క్యారెక్టర్ చేశారని చెప్పగా అందులో నేను జీబ్ డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పారట.

actor sammeta gandhi comments about balakrishna real behavior details,  balakrishna, sammeta gandhi, vakeel saab, actor sammeta gandhi, sammeta  gandhi about balakrishna, director boyapati krishna , akhanda - Telugu  Sammeta Gandhi, Akhanda, Balakrishna,

దాంతో చిరంజీవి ఆ క్యారెక్టర్ చేసింది మీరేనా ఆ సీన్ నేనెప్పుడూ మర్చిపోలేనని చిరంజీవి చెప్పారట. ఇక ఇప్పుడు తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో కూడా మళ్లీ ఆయనతో కలిసి ఆయన అనుచరులు ఒకరిగా నటించబోతున్నానని తెలియజేశారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే.. టైం సెన్సులో కచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంటారని తెలిపారు.ఒకప్పుడు ఎన్టీఆర్ ఇలా టైంను మైంటైన్ చేసేవారు ఇప్పుడు చిరంజీవి గారు అలా మెయింటైన్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సెట్ లో ఉన్న వారందరితో చిన్న పిల్లల లాగా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పారు. ఎదుటివారిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా గౌరవిస్తారని తెలిపారు సమ్మేట గాంధీ.

Share post:

Latest