బాలయ్య కుమారుడు ఎంట్రీ కోసం ఆ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్..!!

నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ పై అభిమానులు ఇప్పటికీ ఇంకా ఎంతకాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు తన కుమారుడు సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. ఒకసారి బాలకృష్ణ తానే స్వయంగా ఆదిత్య 369 సినిమాను సీక్వెల్ తెరకెక్కిస్తానని ఆ సినిమాతోనే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటూ తెలియజేశారు. అయితే ఆ తర్వాత మోక్షజ్ఞ ఈ సినిమా గురించి ఎప్పుడూ కూడా చర్చలు జరగలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి మోక్షజ్ఞ ఎంట్రీ పై సినీ ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Balakrishna confirms Mokshagna's Debut

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది బాలకృష్ణ కుమారుడు ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేసే బాధ్యతలను ఒక యంగ్ డైరెక్టర్ కి అప్పచెప్పినట్లు వార్తలు వినిపిస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్న రాహుల్ సాంకృత్యన్.. బాలకృష్ణ కుమారుడిని ఇండస్ట్రీకి లాంచ్ చేసే బాధ్యతలు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకొని రాహుల్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.

Rahul Sankrityayan: Director Shyam Singarai is preparing the story on the theme of time travel .. | Shyam singha roy director rahul sankrityayan about his next movie CB News | crazy Bollywood News Updates

ఇక ఈ కథను బాలకృష్ణ, మోక్షజ్ఞ తో చర్చించిన రాహుల్ వారి నుంచి సినిమాకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలి అంటే ఈ విషయంపై బాలకృష్ణ స్పందించాల్సి ఉంటుంది. ఇక మోక్షజ్ఞ వెండి ధరపై ఎలా కనిపిస్తారో అంటూ బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest