ఎస్వీ రంగారావు భార్య అందుకే ఆయనకు దూరమైందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు.. స్వరంలో గాంభీర్యం.. మాటల్లో స్పష్టత.. డైలాగ్ చెప్పడంన, అభినయంలో ఆయనకు సాటి ఎవరూ ఉండదరు. ఏ పాత్ర అయినా.. అందులో పరకాయ ప్రవేశం చేసే నటుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించారు. నర్తనశాల సినిమాలో ఎస్వీ రంగారావు నటనకు భారత రాష్ట్రపతి బహుమతి మాత్రమే కాకుండా ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో కూడా బహుమతిను సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా ఆయన నంది అవార్డులను అందుకున్నారు. ఆయన విశ్వనాథ చక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ వంటి ఎన్నో బిరుదులు పొందారు.

1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో ఎస్వీ రంగారావు జన్మించారు. ఆయన మద్రాస్ లో ఆ తర్వాత ఏలూరు, విశాఖపట్నంలలో చదువు కొనసాగించారు. చదువుకునే రోజుల్లోనే ఆయనకు నాటకాలపై ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్ గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో ‘వరూధిని’ చిత్రంతో నటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆయనకు మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్ పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి సినిమాలు చేయడం ప్రారంభించారు. 1975లో వచ్చిన యశోద కృష్ణ ఆయన చివరి చిత్రం..

కాగా.. ఎస్వీ రంగారావు టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయన మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబర్ 27న పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు సినిమా అవకాశాలు అంతగా లేవు.. దీంతో ఆయనకు కుటుంబాన్ని కూడా పోషించగలిగే స్తోమత లేదు. అందుకే ఎస్వీఆర్ భార్య పెళ్లయిన కొత్తలోనే ఆయనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయారట.. అప్పట్లో ఆయన భార్య లీలావతికి డబ్బుపై వ్యామోహం ఎక్కువ ఉండేదట.. ఆమె వెళ్లిపోయేటప్పుడు ఎస్వీఆర్ ఎదురు చెప్పలేదట. పైగా ఇష్టమొచ్చినప్పుడు తిరిగా రా.. రాబోయే రోజులు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని భరోసా కూడా ఇచ్చారట.. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నారట.. కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కానీ కొన్ని కారణల వల్ల ఆ సినిమా ఆగిపోయింది..