“తార్ మార్ టక్కర్ మార్” మెగా అభిమానులకు ఊపు తెప్పిస్తున్న లిరికల్ వీడియో.. ఇరగదీసిన మెగాస్టర్ ..!!

చిరంజీవి ఎంతో ప్రెస్టేజ్ సినిమాగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుండి ఈరోజు ‘తార్ మార్ ట‌క్కర్ మార్’ మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమ‌ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో తెలుగులో తెర‌కెక్కింది. ఈ సినిమ‌కు మోహన్ రాజా దర్శకత్వం వహించ‌రు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో చిరంజీవితో క‌లిసి బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇద్దరు మెగాస్టార్లు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు. ఆ స్పెషల్ సాంగ్‌కి తార్ మార్ ట‌క్కర్ మార్ అని పేరు పెట్టారు మరియు దీనిని మేకర్స్ అధికారికంగా ఈ రోజు విడుదల చేశారు.

Thaar Maar Thakkar Maar - Full Song | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S - YouTube

గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, మరియు సత్యదేవ్ ఇతరలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీవీఆర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ‌ర్క్ చేసిన ఈ గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Share post:

Latest