టీచర్స్ డే స్పెషల్: మన ఇండస్ట్రీలో ఎంత మంది టీచర్స్ ఉన్నారో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!

టీచర్స్/గురువు.. మనకి జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసిన కరిగిపోతుందేమో కానీ విద్యాదానం చేస్తే అది చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది.. ఈ మాటలు ఎక్కువ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమే అందుకే తల్లిదండ్రుల రుణం గురువు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే గురువు మనం జీవితంలో ముందుకెళ్లడానికి ఓ మార్గం చూపిస్తాడు.. అందుకే గురువుని గౌరవించాలి. సెప్టెంబర్ 5 టీచర్ల దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సంధర్భంగా ఆయన గుర్తుగానే మనం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది టీచర్స్ ఉన్నారు . మొదట టీచర్స్ గా చదువులు చెప్పి ఆ తర్వాత సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన వారు బోలెడు మంది. వారు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

చిత్ర పరిశ్రమలో తమదైన టాలెంట్ తో అదరగొట్టేసిన మోహన్ బాబు ,పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ ,రాజబాబు, ఆనంద్ మోహన్, గుండు సుదర్శన్, సుకుమార్ వంటి వాళ్లు తెరపైనే కాదు.. నిజజీవితంలోనూ పాఠాలు చెప్పి శభాష్ అనిపించుకున్నారు. వీలు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు టీచర్స్ గా వర్క్ చేసి పలువురు విద్యార్థుల జీవితాలను చక్కబెట్టారు . ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీస్ ని తీర్చిదిద్దుతున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ : పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఇద్దరిలో చిన్నవారు. మాటల రచయితగా నటుడిగా పాపులర్ అయిన తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావు తో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. బోలెడు విజయాలు అందుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఈయన టీచర్ గా తన జీవితం కొనసాగించారు .సినీ నటునిగా కూడా సంభాషణలు వైవిధ్యభరితంగా చెప్పగలిగిన స్వతఃసిద్ధ ప్రతిభతో రాణించారు. ఎం.ఎ.(తెలుగు) చదివి ఆంధ్రోపన్యాసకునిగా తెలుగు బోధిస్తుండగా సినిమా అవకాశాలు వచ్చాయి. కొద్దికాలం అటు సినిమాలలో పనిచేస్తూనే ఇటు బోధన కూడా కొనసాగించారు. సినిమాలు విజయవంతం కావడంతో సినీరంగంలోనే భవిష్యత్తు నిర్ణయించుకుని ఆంధ్రోపన్యాసకునిగా వున్న ఉద్యోగాన్ని వదిలేశారు.

బ్రహ్మానందం: సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనదైన స్టైల్ లో రాణిస్తున్నారు. ఇప్పటికే బోలెడన్ని సినిమాల్లో నటించి తన సత్తా చాటిన ఆయన ఇప్పటికీ సినిమాల్లో వైవిద్య భరితమైన రోల్స్ చేస్తూ జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. బ్రహ్మానందం సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చుకున్నాడు. డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన బ్రహ్మానందం గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలకు పైగా లెక్చరర్ గా పనిచేశాక ..సినీ రంగంలో అవకాశం రావడంతో అటువైపుగా అడుగులు వేసి ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాడు.

మోహన్ బాబు: మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఏ డైలాగ్ చెప్పినా ఆ డైలాగ్ కి ప్రాణం పోసినట్లు ఉంటుంది. తనదైన స్టైల్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తున్న మోహన్ బాబు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు శిష్యుడుగా గుర్తింపు పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్ర నటించే అవకాశం లభించింది .అయితే విలన్ గా క్యారెక్టర్ నటుడిగా హీరోగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల స్థాపించాడు .తెలుగు సినీ రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీను పూర్తి చేసి సినిమా రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970లో ప్రారంభం లో అర్థం దశాబ్దం పాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశాడు.

Share post:

Latest