వైసీపీ ఖాతాలోకి టీడీపీ సిట్టింగ్ సీట్లు?

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి…ఎప్పటికప్పుడు ప్రధాన పార్టీల మధ్య వార్ పెరుగుతూ వస్తుంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇక నెక్స్ట్ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటలపై టీడీపీ…టీడీపీ కంచుకోటలపై వైసీపీ ఫోకస్ చేసి పనిచేస్తున్నాయి.

అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ గెలిచిన సిట్టింగ్ సీట్లపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఫోకస్ పెట్టి ఎలా పనిచేస్తున్నారో తెలిసిందే. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ రాజకీయం చేస్తుంది. ఇంకా పలు టీడీపీ సిట్టింగ్ సీట్లపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది. కానీ అన్నీ సీట్లలో వైసీపీకి అవకాశాలు దొరకలేదు. కొన్ని సీట్లలో మాత్రం వైసీపీకి మంచి అవకాశాలు దక్కాయి.

తాజాగా వచ్చిన ఓ సర్వేలో…టీడీపీ సిట్టింగ్ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంటుందని తేలింది. అలా వైసీపీ ఖాతాలో పడే సీట్లలో విశాఖ నార్త్, విశాఖ సౌత్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో విశాఖ సిటీలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లని టీడీపీ గెలుచుకుంది. తర్వాత సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లారు. దీంతో సౌత్ లో వైసీపీ బలం పెరిగింది. అటు నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు టీడీపీలో లేరు…ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం లేదు. దీంతో నార్త్ కూడా వైసీపీ వైపుకు వెళ్లింది.

ఇక మండపేట, గన్నవరం, గుంటూరు వెస్ట్, చీరాల, ఉరవకొండ సీట్లలో కూడా వైసీపీ బలం పెరిగింది. గన్నవరం, గుంటూరు వెస్ట్, చీరాల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో ఆ సీట్లలో వైసీపీ బలం పెరిగింది. ఇలా కొన్ని టీడీపీ సిట్టింగ్ సీట్లని వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే…వీటిల్లో కొన్ని సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశాలు లేవు.

Share post:

Latest