వెలగపూడికి నాల్గవ ఛాన్స్..బాబు ఫిక్స్..!

గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ గాలిలో సైతం…భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఒకరు. చంద్రబాబు, ఆదిరెడ్డి భవాని..ఆ తర్వాత మంచి మెజారిటీ వచ్చింది వెలగపూడికే..దాదాపు 26 వేల ఓట్ల మెజారిటీతో వెలగపూడి..విశాఖ ఈస్ట్ నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంతకముందు 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా మూడుసార్లు గెలిచిన వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో బలంగా ఉన్న వెలగపూడికి మళ్ళీ గెలిచే ఛాన్స్ రానివ్వకూడదని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అన్నివైపులా నుంచి వెలగపూడిని టార్గెట్ చేస్తూనే వచ్చారు. పైగా అమరావతి రాజధానికి వెలగపూడి మద్ధతు తెలపడంతో..ఆయన్ని వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసి..ఆయన ఇంటి వద్ద కొన్ని రోజులు హడావిడి చేశారు. ఎక్కడకక్కడ వెలగపూడిని దెబ్బకొట్టాలని చూశారు.

ఇదే క్రమంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నిక సమయంలో తూర్పులో ఉన్న మెజారిటీ డివిజన్లని వైసీపీ గెలుచుకుంది. దీంతో వెలగపూడి పని అయిపోయిందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ వచ్చాయి. అలాగే ఆయన ఆస్తులు టార్గెట్ గా విజయసాయిరెడ్డి ఎలాంటి రాజకీయం నడిపారో కూడా తెలిసిందే. అయినా సరే వెలగపూడి ఎక్కడా కూడా బెదరకుండా పార్టీలో నిలబడి..మళ్ళీ దూకుడుగా పనిచేస్తూ వచ్చారు. ఆ దూకుడు ఇప్పుడు వెలగపూడికి బాగా ప్లస్ అయింది.

ఈ సారి ఎన్నికల్లో కూడా వెలగపూడికే గెలుపు అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేల్లో తేలింది. ఇప్పటికే చంద్రబాబు సిట్టింగులకే మళ్ళీ సీటు అని ప్రకటించారు. తాజాగా వెలగపూడి..బాబుతో భేటీ అయ్యి నియోజకవర్గంలోని పరిస్తితులని వివరించారు. అలాగే ఈ సారి కూడా మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి బాబు..వెలగపూడికి మరోసారి సీటు కన్ఫామ్ చేశారు. అయితే విశాఖ తూర్పులో వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది..పైగా వెలగపూడిపై నెగిటివ్ లేదు. దీంతో మరొకసారి తూర్పులో వెలగపూడి సత్తా చాటేలా ఉన్నారు.

Share post:

Latest