ఎన్డీటీవీ సర్వే: తమ్ముళ్ళ జోరు…!

రాష్ట్రంలో రాజకీయం హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే…అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది..ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది…రెండు పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్నాయి. ఎలాగైనా మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ, ఈ సారి ఖచ్చితంగా గెలవాలని టీడీపీ చూస్తుంది. మొత్తానికి రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.

ఇక ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు ఎక్కువైంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో సర్వేలు చేస్తున్నాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇక ఇటీవల పలు జాతీయ సర్వేలు కూడా వచ్చాయి…అయితే ఎక్కువ సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది. కానీ తాజాగా ఎన్డీటీవీ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అది కూడా తెలుగు తమ్ముళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సర్వే టీడీపీకి అనుకూలంగా ఉందని. అయితే ఆ సర్వే అధికారికంగా ఎన్డీటీవీ మాత్రం ఇవ్వలేదు..కానీ అది ఒరిజినల్ అని చెప్పి టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 98 సీట్లు, వైసీపీకి 72 సీట్లు, జనసేనకు 5 సీట్లు వస్తాయని చెబుతున్నారు. అంటే ఈ సర్వే విడివిడిగా పోటీ చేస్తే ఫలితాలు అనే…అదే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే…146 సీట్లు గెలుచుకుంటాయని, అలాగే వైసీపీకి 29 సీట్లు మాత్రమే వస్తాయని తమ్ముళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో ఈ సర్వేలని నమ్మడానికి లేదు. వైసీపీ వాళ్ళు ఏమో తమకే ప్రజలకు మద్ధతు ఉందని…మళ్ళీ వైసీపీకి 130 పైనే సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇటు టీడీపీ వాళ్ళు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. మరి చివరికి ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూడాలి.