‌తారక్‌ని తగులుకున్న తమ్ముళ్ళు..!

అనూహ్యంగా జగన్ ప్రభుత్వం…ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే పేరు మార్చేసి..కేబినెట్ ఆమోదం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకున్నారు. దాదాపు 25 ఏళ్లపై నుంచి ఉన్న ఎన్టీఆర్ పేరుని తీసేయడంపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు గట్టిగానే పోరాడుతున్నారు. అసలు ఎన్టీఆర్ పెట్టిన యూనివర్సిటీకు వైఎస్సార్‌తో సంబంధం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.

జగన్ ఏమో వైఎస్సార్ డాక్టర్ చదివారు..పైగా తాము మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నాం..అందుకే వైఎస్సార్ పేరు పెట్టమని లాజిక్ లేని క్లారిటీ ఇచ్చారు. అయినా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై నందమూరి ఫ్యామిలీ కూడా గట్టిగానే స్పందించింది. రామకృష్ణ, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. అటు పురంధేశ్వరి కూడా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

కానీ అందరూ బాగానే స్పందించారు గాని..ఎన్టీఆర్ మాత్రం డిప్లమాటిక్‌గా స్పందించారు. ఎన్టీఆర్-వైఎస్సార్ విశేష ప్రజాధరణ కలిగిన నేతలని..వీరిలో ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల..వైఎస్సార్ గౌరవం పెరగదని, అలాగే ఎన్టీఆర్ గౌరవం తగ్గదని, తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్‌ని ఎవరు చెరిపివేయలేరు అంటూ మాట్లాడారు. అంటే అటు టీడీపీకి మద్ధతుగా మాట్లాడలేదు. ఇటు వైసీపీని విమర్శించలేదు. పేరు మార్చడాన్ని తప్పుబట్టలేదు.

దీనిపై తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అసలు ఎన్టీఆర్ స్పందించకుండా ఉంటే బాగుండేది అని..అయినా ఎన్టీఆర్‌ని, వైఎస్సార్‌ని ఒకేలా ఎలా చూస్తారని..ఎన్టీఆర్ గొప్పోడు అని, అలాంటి ఆయన్ని వైఎస్సార్‌తో పోల్చడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. రాజకీయ నాయకులు కంటే ఎన్టీఆర్ ఎక్కువ రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం..ఎన్టీఆర్ హుందాగా స్పందించారని అంటున్నారు. అయితే ఈ విషయంలోనైనా ఎన్టీఆర్ మద్ధతు దక్కుతుందనుకున్న తమ్ముళ్ళకు నిరాశే ఎదురైంది. మొత్తానికి ఎన్టీఆర్ కర్రా విరగకూడదు..పాము చావుకూడదు అనే విధంగా మాట్లాడి..అసలైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు.