బ్రహ్మాస్త్రం మూవీని రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు.. కారణం అదేనట..!!

సినిమాల ఎంపిక విషయంలో యువ హీరోలు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు.కథ బలంగా ఉంటే చాలు సినిమా చేయడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు ప్రస్తుతం యువ హీరో సుదీర్ బాబు. తాజాగా హీరో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించినది.

Sridevi Soda Center teaser: On Sudheer Babu's birtdhay, makers give us a  glimpse of 'Lighting Sooribabu' | Entertainment News,The Indian Express

ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్ర బృందం ఈ ప్రమోషన్లలో భాగంగా హీరో సుదీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన బ్రహ్మాస్త్ర సినిమా లో తనకు అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించారు. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబుకు నటించే అవకాశం వచ్చిందట. అయితే అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించినట్లుగా సుధీర్ బాబు తెలియజేశారు.

Brahmastra movie review LIVE updates, Tweet reactions: Fans calls it  'spectacular', netizens feel it's a DISASTER! | Movies News | Zee News
అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో ఏ పాత్రలో ఛాన్స్ వచ్చిందనే విషయం మాత్రం తెలుపలేదు. తాను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించలేకపోయానని తెలియజేశారు. ఇక గతంలో కూడా టైగర్స్ ష్రాష్ నటించిన భాగీ సినిమాలో కూడా సుధీర్ బాబు విలన్ గా నటించారు. ఏది ఏమైనా ఒక పాన్ ఇండియా సినిమాలో సుధీర్ బాబు నటించిన లేకపోవడంతో ఆయన అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంగా ఉన్నారు కానీ ఆ అమ్మాయి గురించి మీకు తెలుసా సినిమా విజయం దిశగా దూసుకుపోతూ ఉండడంతో కాస్త ఆనందపడుతున్నారు.

Share post:

Latest