సీతారామంలో ‘ సీత ‘ న‌టించిన తెలుగు సీరియ‌ల్ ఏదో తెలుసా…!

హను రాఘవపూడి డైరెక్షన్లో అందమైన ప్రేమ కథగా వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ లకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడే. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కొంత ఈ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Sita Ramam OTT Release Date Announced - To Stream On OTT Platform From This  Date? - Telegraph Star

సీతారామంలో నటించిన మృణాల్‌ ఠాగూర్ తన మొదటి సినిమాతోనే అందరిని అబ్బురపరిచింది. ఇందులో ఈమె నటించిన సీత క్యారెక్టర్ తో చాలా పాపులర్ అయింది. తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాగూర్ కన్నా సీత అంటేనే అందరూ గుర్తుపట్టే విధంగా ఈ సినిమాతో ఈమెకు పేరు వచ్చింది. మృణాల్ తన కెరియర్‌ను ముందుగా బుల్లితెరపై మొదలు పెట్టింది. హిందీలో చాలా సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది.

ఈమె ఈ సినిమా కన్నా ముందు తెలుగు ప్రేక్షకులకు ఓ సీరియల్ ద్వారా పరిచయం అయిందట.
ఆ సీరియలు ఆమె నటనకు గాను హిందీలో ప‌లు అవార్డ్స్ కూడా వచ్చేయట. ఆ సీరియల్ ఏంటంటే కుంకుమ భాగ్యం, ఈ సీరియల్ తెలుగులో కూడా వచ్చింది. ఈ సిరియాలతో మృనాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈ సీరియల్ వచ్చిన టైంలో టిఆర్పీ కూడా బాగా వచ్చేది. ఈ సీరియల్ ద్వారానే ఈమెకు మరింత గుర్తింపు వచ్చింది.

తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాను హిందీలో డబ్ చేస్తే అక్కడ ఆ సినిమాలో మృనాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటించి అందర్నీ మెప్పించింది. ఈమె తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్‌ను దక్కించుకుంది. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేట‌ప్పటికే ఈ అమ్మడికి 30 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఈ వయసులో కూడా అందాల భామ అవకాశాలు దక్కించుకుంటు. స్టార్ హీరోయిన్గా మారటానికి ప్రయత్నాలు చేస్తుంది.

Share post:

Latest