మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ఇప్పుడు ఎవ‌రితో ఉంటుందో తెలుసా…!

మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మ‌నోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అత‌డి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులైన తర్వాత ప్రణతి రెడ్డి అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉంటుంది.

Manchu Manoj reacts to trolls on Mohan Babu, Vishnu & Lakshmi: One person  influenced abusive attacks | PINKVILLA

మనోజ్ మాత్రం సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉండిపోయాడు. తాజాగా ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియాలో వైరల్ గాా మారాడు. మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలు నిజమే అన్నట్టు మనోజ్ – మౌనిక వినాయక చవితి సందర్భంగా హైదరాబాదులోని వినాయక మండపాలు తిరుగుతూ అక్కడ పూజలు చేస్తూ మీడియా కంటపడ్డారు.

ఇక దీంతో కొద్దిరోజుల్లోనే మనోజ్.. మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్తలు నిజమని అందరూ నమ్మారు. దీంతోపాటు మోహన్‌బాబు చంద్రబాబును కలిసింది కూడా వీళ్ల‌ పెళ్లి విషయం గురించే అని కూడా వార్తలు వచ్చాయి. ఇక దీంతో మనోజ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ గా మారిపోయాడు. ఇప్పుడు మనోజ్ గురించి సోషల్ మీడియాలో తెగ కామెంట్లు సచ్చలు జరుగుతున్నాయి.

Manoj Manchu confirms divorce with wife Pranathi Reddy: We went through a  lot of pain - Movies News

ఇప్పుడు మనోజ్ మొదటి భార్య ఏం చేస్తుందో అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన మొదటి భార్య ప్రణతి ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఆయనతో విడిపోయాక ఆమె ఒంటరిగా ఉంటూ తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది. మనోజ్ రెండో పెళ్లి విషయం బయటకు రావడం మొదటి భార్య గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.