నా పర్సనల్ లైఫ్ పై పోకస్ ఎందుకు.. కన్నీరు పెట్టుకునున్న సునీత..

సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే.. తన అద్భుతమైన వాయిస్ తో.. తక్కువ సమయంలోనే సింగర్ గా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. టీవీ యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటారు. ఇక టాలీవుడ్ లో ఏ సింగర్ కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు సునీత..

ఆ తర్వాత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే సునీత రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలా మంది అభిమానులు ఆమెను వ్యతిరేకించారు. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటూ విమర్శలు చేశారు. అయితే సునీతా మాత్రం తనపై వస్తున్న విమర్శలను అస్సలు పట్టించుకోలేదు. రెండో పెళ్లి విషయంలో ఆమె ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డబ్బు కోసం చేసుకుందని, సుఖం కోసం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ పై సింగర్ సునీత స్పందించారు. ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ఇదే విషయంపై ప్రశ్నించారు. ‘మీ రెండో పెళ్లి విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటి గురించి మీరేమంటారు’ అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో సునీత చాలా భావోద్వేగానికి లోనవుతూ.. ‘చిత్ర గారి తర్వాత సునీత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పందని, చాలా మందికి ఎంటర్ టైన్మెంట్ కి నేనే కారణమని మీరు అంటూ ఉంటారు కదా.. ఇవన్నీ మంచి విషయాలు కాదా.. వీటి గురించి చెప్పకుండా నా పర్సనల్ లైఫ్ పై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు. ఒక మనిషిని ఒక మాట అనే ముందుకు ఒక్క నిమిషం ఆలోచించాలి.. అందే సంస్కారవంతుల లక్షణం.. వాళ్లేం మాట్లాడుతున్నారో’.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. సునీత చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest