బిగ్ బాస్ సీజన్6 గురించి సింగర్ రేవంత్ షాకింగ్ పోస్ట్.

బిగ్ బాస్ సీజన్ 6 ఈ నెల 4 న ప్రారంభం కాబోతోంది.దీని గురించి సోషల్ మీడియా లో సింగర్ రేవంత్ ఒక పోస్ట్ చేసారు,అది ఇపుడు వైరల్ గ మారింది.రేవంత్ బిగ్ బాస్ సీజన్6 లో తాను పార్టిసిపేట్ చేస్తున్న అని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.ఆల్రెడీ బిగ్ బాస్ లో కి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది.కంటెస్టెంట్స్ అందరు క్వారంటైన్ లో వున్నారు.ఈ క్రమం లోనే కంటెస్టెంట్స్ దగ్గర మొబైల్స్ తీసేసుకున్నారు.సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ షో స్టార్ మా లోప్రసారం కానుంది.

అలాగే హాట్ స్టార్ లో24 గంటలు బిగ్ బాస్ షో స్ట్రీమ్ అవబోతుంది.అయితే క్వారంటైన్ లో వున్నా కాంటస్టెంట్స్ నిన్నటి నుండి తమ మొబైల్స్ తీసేసుకున్నట్టు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆక్టివ్ గ వుంటూ పోస్ట్స్ పెట్టడంతో తెలుస్తోంది.బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇవ్వబోతున్న వారిలో పాపులర్ సింగర్ రేవంత్ కూడా ఉన్నట్టు అయన చేసిన ఇంస్టా పోస్ట్ తో కంఫర్మ్ అయింది.

అయితే రేవంత్ తాను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్టు చెప్పటమే కాకుండా ఈ సారి టైటిల్ విన్నర్ తానే అని సెన్సషనల్ పోస్ట్ పెట్టారు.లైఫ్ లో కొన్ని త్యాగం చేయటం చాల కష్టం అని,తాను తన భార్యని,తనకు ఇష్టమైన సంగీతాన్ని చాల మిస్ అవుతానన్నారు.అయినా కూడా భగీరథ తపస్సులా స్ట్రాంగ్ ఉండి,టైటిల్ గెలిచి మంచి పేరుతో బయటకి వస్తానని చెప్పటం హైలైట్.మీ అందరి ఆశీస్సులు మీ వోట్ ద్వారా అందించండి.అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు రేవంత్. ఏది ఏమయినా రేవంత్ కాంఫిడెన్స్ చూస్తుంటే టైటిల్ విన్ అవుతాడో లేదో కానీ బిగ్ బాస్ లో మంచి టాఫ్ ఫైట్ ఇచ్చేలానే వున్నాడు మరి.

Share post:

Latest