తన మొదటి పారిపోషకాన్ని ఎన్టీఆర్ ఎలా ఖర్చు చేసేవారో తెలిస్తే షాక్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వర్గస్తులయ్యి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఒక నటుడిగా ఎంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారో.. రాజకీయవేత్తగా కూడా అంతకుమించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్న గారు అని ప్రేమగా పిలుచుకునే ఎన్టీఆర్ ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. ఇక రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో నిలుదొక్కుకోవడమే కాదు స్నేహితులను కూడా సినిమా రంగంలో నిలదొక్కుకునేలా చేసిన గొప్ప స్నేహితుడు అని చెప్పవచ్చు.

Remembering NT Rama Rao on his 97th birth anniversary | Entertainment  Gallery News,The Indian Express

తాజాగా ఈయనకు సంబంధించిన ఒక్కొక్క విషయం ప్రస్తుతం వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్టీఆర్ , ఏఎన్నార్ హీరోలుగా పనిచేస్తున్న సమయంలో విజయ వాణి సంస్థ నెలవారీగా వీరికి పారితోషకం అందించేది. అలా మొదట్లో వచ్చిన పారితోషకం కేవలం రూ.500 మాత్రమే. ఇక నెలకు ఒకసారి ఎన్ని సినిమాలలో నటించిన సరే ఇంత పారితోషకం మాత్రమే ఇచ్చేవారు. ఒకవేళ వీరు నటించిన సినిమా హిట్ అయితే మరో రూ. 5000 అదనంగా అందించేవారు. అయితే మిగిలిన హీరోలు మాత్రం ఆ సమయంలో 300 రూపాయల వరకు మాత్రమే నెలకు సంపాదించడం జరిగింది. ఇకపోతే ఎంత పారితోషకం వచ్చినా సరే ఖర్చుల విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా తీసుకునేవారు.

అయితే ఈ విషయాలను ఎన్టీఆర్ స్నేహితుడు గుమ్మడి వెంకటేశ్వరరావు స్వయంగా తన డైరీలో రాసుకున్న తీపి గుర్తులు , చేదు జ్ఞాపకాలు ఎన్నో అన్న గారి గురించి ప్రస్తావించడం జరిగింది.. రూ.200 సంపాదించి రూ.400 ఖర్చు చేసే నన్ను ఎన్టీఆర్ ఎప్పుడూ మందలిస్తూ ఉండేవారు. ఆదాయంలో ఖర్చులు ఉండాలి తప్ప అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదని తెలిపేవారు అని గుమ్మడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఇక అన్నగారు నెలకు రూ.500 సంపాదించి అందులో 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేవారు. ఇంటి రెంటుకు 50 రూపాయలు, నెలకు అయ్యే భోజనం ఖర్చు రూ.25, టీ , కాఫీ ఖర్చులకు మరో 25 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని ఇంటికి పంపించేవారు అంటూ గుమ్మడి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాసుకున్న విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.