అలనాటి కమిడియన్ గుండు హనుమంతరావు గురించి ఈ విషయాలు మీకు తెలుసుండదు!

తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి నటులు గురించి మాట్లాడుకుంటే అందులో ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతు రావు గారు తప్పకుండా వుంటారు. ఈయన సుమారు 400 సినిమాలలో నటించారనే విషయం ఎంతమందికి తెలుసు. సినిమాలే కాకుండా బుల్లితెర ధారావాహికలో కూడా ఇతను చేసి అన్నిరకాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘అమృతం’ సీరియల్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే రెండవ వ్యక్తి మన గుండు హనుమంతురావు. గుండు హనుమంతురావు కి ఒక కుమార్తె, ఒక కొడుకు వుండేవారు . కానీ తన కూతురు చిన్నప్పుడే మెదడువాపు జ్వరంతో చనిపోయింది. అతని జీవితంలో అత్యంత అధకారమైన సంఘటనలలో ఇది మొదటిది.

ఇక తన కొడుకు మాత్రం సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. గుండు హనుమంతు మొదటగా నటించిన సినిమా ఆహనా పెళ్ళంట. ఈ సినిమా జంధ్యాల దర్శకత్వంలో అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో గుండు హనుమంతరావు చేసింది ఒక చిన్న పాత్రే కానీ గుర్తింపు ఉన్న పాత్ర కావడం గమనార్హం. ఇక బ్రహ్మానందం తోనూ, రాజేంద్రప్రసాద్ తో, ఆలీ తో కూడా కలిసి పలు చిత్రాలలో నటించి నవ్వించారు. అంతేకాకుండా అగ్ర దర్శకులు అయినా జంధ్యాల, ఎస్ .వి కృష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగారు.

ఈయన జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాల లిస్ట్ చూస్తే, రాజేంద్రుడు గజేంద్రుడు, కొబ్బరి బొండం, యమలీల, మాయలోడు, శుభలగ్నం, ఆలస్యం అమృతం, పెళ్ళాం ఊరెళితే, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లికాని ప్రసాద్ లాంటి సినిమాలను చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆయన చేసే సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్ లక్షల్లో ఉన్నా కూడా ఆయన ఏనాడు అత్యాశకు పోయేవాడు కాదట. వచ్చే లక్షల కన్నా సాంఘిక దురాచారాలపై పోరాడడమే ఆయన ప్రధమ లక్ష్యమట. అలా సాంఘిక దురాచారాలపై వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా విశ్వతంగా ప్రచారం నిర్వహించారు. అయినా ఆయన చివరి రోజుల్లో చాలా కష్టపడ్డారు అని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు.

Share post:

Latest