చైతు – సామ్ విడాకుల‌పై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన సామ్ తండ్రి…!

టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల త‌ర్వాత‌ చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తూ అక్క‌డ బిజీగా ఉంటే చైతు కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చ‌ద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

ఇక విడాకుల త‌ర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్ద‌గా స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు సామ్ తండ్రి
జోసెఫ్ ప్రభు కుమార్తె విడాకులపై స్పందించారు. వీరిద్ద‌రు విడిపోయారని తెలిసినప్పటి నుంచి నా మైండ్ బ్లాంక్ అయింది. త్వరలోనే పరిస్థితులు చక్కబడ‌తాయ‌ని ఆయ‌న అన్నారు. సమంత – చైతన్య అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పిన ఆయ‌న చైతో మా కుటుంబం గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాలు మాకు ఎప్ప‌ట‌కీ గుర్తుంటాయ‌ని అన్నారు.

Samantha Ruth Prabhu's Father's Facebook Post is Heartbreaking

వీరిద్ద‌రు విడిపోయినా వారి జీవితాల్లో మాత్రం ఇద్దరు ముందుకు సాగాలని జోసెఫ్ ప్ర‌భు సంకేతాలు పంపినట్లు అయింది. ఏదేమైనా నాగ‌చైత‌న్య‌ని కూడా సమంత కుటుంబం ఎంత గా అభిమానించిందో.. ప్రేమించిందో జెసెఫ్ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టే తెలుస్తోంది.

Share post:

Latest