I am back అంటున్న క్యాంపా కోలా.. పాత డ్రింక్ కొత్తగా

క్యాంపా కోల ఇది ఒక శీతలపానీయం , ఇలాంటి ఒక డ్రింక్ ఉందని మనలో చాల మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఇప్పటి డ్రింక్ కాదు, 1970 సంవత్సరానికి చెందిన మన స్వదేశీ డ్రింక్ . క్యాంపా కోలని ఢిల్లీ కి చెందిన pure drinks గ్రూప్ రూపొందించింది. ఇది వాస్తవానికి కోకా కోల డ్రింక్ పంపిణీదారుగా స్థాపించబడింది. కోకో కోల సృష్టించిన వాక్యూమ్ తో క్యాంపా అవకాశాన్ని చేజికించుకుంది. అయితే క్యాంపా కోల ” దీ గ్రేట్ ఇండియన్ టేస్ట్ “అనే నినాదంతో తనను తాను బ్రాండ్ చేసుకుంది, దానితో అతి తక్కువ టైం లోనే బాగా ప్రజాదరణ పొందింది.

అప్పటికె మార్కెట్ లో ఉన్న మిగిలిన డ్రింక్ కోకా కోల మొదలైన వాటితో పోటీ పడి మరి నెంబర్ వన్ ప్లేస్ లో నిలబడింది. కొంత కాలం తర్వాత అప్పటి భారత ప్రభుత్వం క్యాంపా కోల యొక్క ఫార్ములాని తెలియచేయవలసిందిగా పట్టుపట్టింది ,అయితే క్యాంపా కోల కి తన ఫార్ములా సీక్రెట్ బయట పెట్టడం ఇష్టం లేక ప్రభుత్యానికి చెప్పడానికి నిరాకరించింది, దానితో నిబంధనలు మరియు చట్టాలకు నిరసన గా భారతదేశం నుండి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. తరువాత కోకా కోల ,పెప్సీ మళ్ళీ తిరిగి భారతదేశం లోకి వచ్చి అవే అగ్రగామిగా నిలిచాయి, వాటితో పోటీపడలేక క్యాంపా కోల నిదానంగా మరుగున పడి కనిపించకుండా పోయింది .

ఒకప్పుడు శీతలపానీయాల లీడర్ గా ఉన్న క్యాంపా కోల మళ్ళీ తన ఉనికిని చాటుకోవడానికి తిరిగి వస్తుంది. క్యాంపా కోల ని పునరుద్దించడానికి రిలయన్స్ సంస్థ ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్ నుండి కొనుగోలు చేసింది. అయితే రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ నేతృత్వంలో “FMCG” వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు అని చెప్పిన రెండు రోజులకే క్యాంపా కోలని 22 కోట్లకి విక్రయించినట్టు తెలుస్తుంది .ఇప్పుడు రిలయన్స్ వారు క్యాంపా కోల ని కోకో కోల ,పెప్సీ కి పోటీగా తీసుకురాబోతున్నారు.

గతంలో రిలయన్స్ వారు లాంచ్ చేసిన jio ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. అలాగే ఈసారి దీపావళి కి క్యాంపా కోల ని లాంచ్ చేయబోతుంది ఈ రిలయన్స్ సంస్థ . క్యాంపా కోల ని దీపావళి కి మర్కెట్స్ లో తీసుకురావడానికి అంత సిద్ధం చేస్తునట్టు ప్రకటించారు. క్యాంపా కోల ని మూడు ఫ్లేవర్స్ తో మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు అవి క్యాంపా ఒరిజినల్ ,లెమన్ ఇంకా ఆరేంజ్ ఫ్లేవర్స్ తో అన్ని రిలయన్స్ సూపర్ మర్కెట్స్ లోకి వస్తున్నట్టు తెలియచేసారు.